రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు

బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు …

01. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ

ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మరియు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు రూ.822.86 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

 ఈ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర ఏడు మండలాల్లో సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది.

02. హోం శాఖ:

2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావజ్జీవ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న 17 మంది ఖైదీలను అర్హులుగా బావించి ప్రత్యేక క్షమాబిక్షను మంజూరు చేసేందుకై హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

03. హోం శాఖ:

APSPFలో 248 కానిస్టేబుల్లను హెడ్ కానిస్టేబుల్లుగా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ల సంఖ్యను 248 కి తగ్గించడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

04. రెవెన్యూ (ల్యాండ్స్):

YSR జిల్లా పేరును YSR కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ (G.O.Ms.No.170, Rev (Lands.IV) Dept., Dt:26.05.2025) ను దృవీకరించేందుకు రెవిన్యూ (ల్యాండ్స్) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

05. రెవెన్యూ (ల్యాండ్స్):

రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, అగిరిపల్లి మండలం, పిన్నమరెడ్డి పల్లి గ్రామంలోని మరియు నూగొండపల్లి గ్రామంలోని మొత్తం 94.497 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక అధికారుల నుండి NOC తీసుకొని హోం శాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవిన్యూ (ల్యాండ్స్) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

06. రెవెన్యూ (ఆర్ & ఎస్):

ఏలూరు జిల్లాలో నిర్మించతలపెట్టిన హైద్రాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు మాజీ ఐ.ఏ.ఎస్. అధికారిణి శ్రీమతి కసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇవ్వ తలపెట్టిన పెడవేగి మండలం వంగూరు గ్రామంలోని 10.88 ఎకరాల భూమి బదాలాయింపుకు స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించేందుకు రెవిన్యూ (ఆర్ & ఎస్) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ నిర్ణయం ద్వారా రూ.10.54 లక్షల ట్రాన్సఫర్ డ్యూటీ మినహాయింపును హైద్రాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ పొందనుంది.

 07. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ ( LFB & IMS):

కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిదానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై, పరిశ్రమల చట్టం-1948 లోని 54, 55, 56, 59, 64, 65, 66వ సెక్షన్లలోని కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు, 2025 ద్వారా సవరించేందుకు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ ( LFB & IMS) చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

08. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ ( LFB & IMS):

కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిదానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై, ఏ.పీ. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, 1988 లోని 9,10,16,17,73 సెక్షన్లలోని కొన్ని నిబంధనలను ఏ.పీ. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సవరణ బిల్లు, 2025 ద్వారా సవరించేందుకు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ ( LFB & IMS) చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

09. యువత అభివృద్ధి, పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ (YAT & C):

విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రీనివాస్ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలు పర్చిన పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు యువత అభివృద్ధి, పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ" (YAT & C ) చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

10. ఐటి, ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ (ఎస్‌క్యూఎం) స్థాపనకు ఐటి, ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

భారత దేశ జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని స్థాపించి, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టిసిఎస్, ఐబిఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. 

11. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ:

యోగాంధ్ర-2025 లో భాగంగా జూన్ 21 న నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలకు సూచనలు తీసుకొనేందుకై ఎపిఎంఎస్‌ఐడిసి, జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్లను ధృవీకరించేందుకు ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

12. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ:

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEDCO) ద్వారా NTR జిల్లా, వేమవరం గ్రామంలోని JETCITY వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

13. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ:

ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవవేత్త అనే నిర్ణయాత్మక విధానంతో ప్రతి శాసన సభ నియోజకవర్గంలో ఒక MSME పార్కు చొప్పున మొత్తం 175 నియోజక వర్గాల్లో మొత్తం 175 MSME పార్కులను అభివృద్ది పర్చేందుకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 

Comments

-Advertisement-