యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, జూన్ 03:యోగా తో వేసి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఆరోగ్య, ఆనంద ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
మంగళవారం యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది యోగభ్యాసకులు పాల్గొని యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21 వ తేది నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో కర్నూలు జిల్లా లో 10 లక్షల మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. యోగాంధ్ర లో భాగంగా ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్ లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు..ప్రస్తుతం గ్రామ స్థాయిలో పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు..
ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలలో యోగా నిర్వహించాలనే థీమ్ లో భాగంగా ఈరోజు ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు.. జూన్ 12 వ తేదీన కొండారెడ్డి బురుజు వద్ద, జూన్ 18 వ తేదీన మంత్రాలయం లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.. అదే విధంగా 5 వేల మంది పారిశుధ్య కార్మికులతో జూన్ 17వ తేదీన కర్నూలు లో యోగా కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుందన్నారు.. ప్రతి ఒకరు యోగా చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 వ తేదీన వైజాగ్ లో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారన్నారు.. ప్రతి రోజు కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యోగా గురించి దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలి, అందర్నీ యోగాలో భాగస్వామ్యులు చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, యోగా గురువులు ముని స్వామి, విజయ్ కుమార్
ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్ ప్రకారం దాదాపు గంట సేపు యోగాసనాలు వేయించారు..
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయ భారతి, ఓర్వకల్లుఎంపిడిఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సాగర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా.ప్రసాద్, యోగాభ్యాసకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..