రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఘనంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ఘనంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలు 

మచిలీపట్నం జూన్ 3: ---

మచిలీపట్నం సంస్కృతిని దశదిశల ఇనుమడింప చేసే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 

మంగళవారం ఉదయం మంత్రివర్యులు నేతృత్వంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, శాప్ చైర్మన్, భైరవంచిత్రం పునీత్ కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ వరకు మసుల ఫెస్ట్ 2025 విజయవంతం కోరుతూ రెండు కిలోమీటర్ల పరుగు (2 కె రన్ )నిర్వహించారు. ఈ సందర్భంగా డిజె సౌండ్, మసులా ఫెస్ట్ ప్రోమో పాటలు, డాల్ఫిన్ వేషదారుల నృత్యాలతో నగరం దద్దరిల్లిపోయింది. డాల్ఫిన్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలందరూ ముఖ్యంగా యువత ఉర్రూతలూగారు. లక్ష్మీ టాకీస్ వద్ద మంత్రివర్యులు స్వయంగా డాల్ఫిన్ వేషదారులతో చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

ఉత్సవాలను ప్రోత్సహించే విధంగా 2కే రన్ లో పాల్గొనేందుకు వచ్చిన భైరవం చిత్రం యూనిట్ హీరోలు నారా రోహిత్, మంచు మనోజు దర్శకులు విజయ్ కనకమెడల నిర్మాత శ్రీధర్ లను మంత్రి అభినందించారు 

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ మచిలీపట్నాన్ని ఒక పర్యాటక కేంద్రము సాంస్కృతిక కేంద్రం గానే కాకుండా ఆర్థికంగానూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగాను తీర్చిదిద్దేందుకు మంత్రి కొలు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. 

ఉత్సవాల ద్వారా దేశవ్యాప్తంగా మచిలీపట్నం పేరు ప్రఖ్యాతులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.

మంగినపూడి బీచ్ ఉత్సవాలలో బీచ్ కబడ్డీ, కయా కింగ్ వంటి జాతీయ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానం మేరకు సినిమా రంగం మీ వెంటే ఉంటామని చిత్ర యూనిట్ ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. 

సినిమా దర్శకులు కనకమెడల విజయ్ మాట్లాడుతూ బీచ్ ఉత్సవాలను విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. భైరవం చిత్రాన్ని కూడా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 

సినీ హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ఉత్సవాలలో పాల్గొనేందుకు మచిలీపట్నం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఒకప్పుడు భారతదేశంలోనే రెండవ ఓడరేవుగా బందరు కోర్టు విరాజిల్లిందన్నారు. మరలా ఆ పోర్టు నిర్మాణం చేపట్టిన ముఖ్యమంత్రికి వందనం అంటూ సెల్యూట్ చేశారు. శాప్ చైర్మన్ రవి నాయుడు క్రీడలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారన్నారు. సినిమా రంగంలో కూడా క్రీడలు నిర్వహించేందుకు ఎంతో ఆసక్తితో చర్చిస్తున్నారన్నారు. 

మరో సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ఉత్సవాలకు టూ కే రన్ లో పాల్గొనాలని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు అన్నారు.

బీచ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలన్నారు. 

ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే అందరికీ తెలుస్తుందని, మచిలీపట్నానికి చారిత్రాత్మక వైభవం బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ పోర్టు నుండే అరుకుల రవాణా జరుగుతుండేవని తెలుస్తోందన్నారు.పోర్టును మరలా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మచిలీపట్నం చారిత్రాత్మక ప్రాంతమని ఇంకా అభివృద్ధి చెందాలన్నారు.ఎండను సైతం లెక్కచేయక 2 కే రన్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

అనంతరం మంత్రివర్యులు కాగడాను వెలిగించి పట్టుకొని టూ కే రన్ లో ముందుకు సాగారు.

ఈ 2కె రన్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, డిఎస్డివో ఝాన్సీ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ కుంచె నాని, రొండి కృష్ణ తదితర అధికారులు ఆనదికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-