అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలి
InternationalYogaDay
yogandhracampaign
yogandhrapratibha
Yogandhra
AndhraPradesh yoga
11th national yoga
National yoga day
About yoga
By
Mounikadesk
అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలి
అనంతపురం నగరంలోని పిటిసి గ్రౌండ్ లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం
- ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, జూన్ 19 :
- జూన్ 21వతేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఈనెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే యోగాంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమం అనంతపురం నగరంలోని పిటిసి గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక గంట సేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తదితరులు పాల్గొంటారన్నారు. జిల్లాలో 23 లక్షల మంది జనాభా ఉండగా, యోగాంధ్రలో భాగంగా ఇంటింటికి సర్వే చేసి 9,97,518 మంది పౌరులను రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. జిల్లా మొత్తం 100 మంది మాస్టర్ ట్రైనర్లు, 6504 మంది ట్రైనర్లు రిజిస్టర్ చేసుకుని ఉన్నారని, శిక్షణ పూర్తి చేసుకున్న పౌరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకంతో ఎక్సలెన్సీ లేదా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయిలలో యోగాంధ్ర సందర్భంగా 14 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా, అందులో గెలుపొందిన అనంతపురం జిల్లా నుంచి 27 మందిని విజయవాడకు పంపడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లాకు చెందిన పౌరులు 8 విభాగాలలో విజయం సాధించి బహుమతులు గెలుపొందారన్నారు. వీరందరు ఈనెల 21 తేదీ విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో ఈనెల 21వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా రిజిస్టర్ చేయబడిన 5,967 వెన్యూ కేంద్రాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 9,97,518 మంది పౌరులు సచివాలయ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రజలందరూ పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సచివాలయ స్థాయిలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారని, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు కూడా మూడు రోజులపాటు వేరువేరుగా సచివాలయ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జిల్లాలో రిజిస్టర్ అయిన వారు కూడా ఏదో ఒక రోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని, ఇప్పటివరకు 8,03,465 మంది ఏదో ఒక రోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారని, మిగిలిన వారు కూడా యోగాంధ్రలో పాల్గొనాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాలను విశాఖపట్నంలో ప్రధానమంత్రి హాజరయ్యే కార్యక్రమానికి అనుసంధానం చేయబడుతుందన్నారు. జిల్లాలోని పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలో వెన్యూలను ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో 10 లక్షల మంది దాకా జిల్లా ప్రజలు పాల్గొని ప్రపంచ రికార్డు చేయగలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, జీవితంలో యోగాని భాగం చేసుకోవాలని, నిత్యం చేసి ఆరోగ్యం బాగుపరచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
- ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆయుష్ అధికారి డా.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments