ప్రతీ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరం కావాలి
ప్రతీ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరం కావాలి
-విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్.,
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం”
యువతను మాదక ద్రవ్యాలకు దూరం చేయడమే లక్ష్యంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన జిల్లా పోలీసుశాఖ
'డ్రగ్స్ దుర్వినియోగం మరియు రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం" సందర్భంగా విజయనగరం
పట్టణంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లీప్యారడైజ్ ఫంక్షను హాలు వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం, యువత, విద్యార్థులతో
పట్టణంలోని లీ ప్యారడైజ్ నుండి కోట జంక్షను వరకు భారీ ర్యాలీ నిర్వహించి, యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు
దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి,
ఐపిఎస్ జూన్ 26న పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ - మాదక ద్రవ్యాలను
నియంత్రించాలనే లక్ష్యంతో గంజాయి పంటను పండించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏజన్సీ ప్రాంతాల్లో 15,000 ఎకరాల్లో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లుగా డ్రోన్స్ సహాయంతో గుర్తించి,
పంటను నాశనం చేసామన్నారు. పోలీసుశాఖ చేపడుతున్న నియంత్రణ చర్యలు ఫలితంగా నేడు 93 ఎకరాలకే గిరి శిఖర గ్రామాల్లో గంజాయి
సాగును పరిమితం చేయగలిగామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి సాగును పూర్తిగా నియంత్రిసామన్నారు.
గంజాయి వ్యాపారాలు సాగిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపడుతున్నామని, వారు సంపాదించిన అక్రమ ఆస్తులను
కూడా సీజ్ చేసి, ప్రభుత్వ పరం చేస్తున్నామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి వ్యాపారాలతో అక్రమ ఆస్తులను కూడబెట్టిన 8మంది నిందితులకు చెందిన 9.20 కోట్ల ఆస్తులను ఇప్పటి వరకు సీజ్ చేసామన్నారు. మాదక ద్రవ్యాల అలవాటుకు యువత దూరంగా ఉండాలని, బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.
జిల్లా కలెక్టరు డా. బి.ఆర్.అంబేద్కర్, ఐఎఎస్ మాట్లాడుతూ - యుక్త వయస్సులో ఉన్న వ్యక్తులు గంజాయికి అలవాటుపడే అవకాశం ఉన్నందున యువతను ఒకచోట సమావేశపర్చి, వారిలో చైతన్యం నింపేందుకు పోలీసుశాఖ ఈ
బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా ఉండాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటుపడేందుకు ఆసక్తి చూపే వారిని నియంత్రించాలని, మాదక ద్రవ్యాల అనర్థాలపట్ల కలిగిన
అవగాహనను ఇతరులకు తెలియజేసి, తద్వారా మరి కొంతమందిని చైతన్యపర్చాలని కోరారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - డ్రగ్స్ నియంత్రణ అన్నది సమాజానికి పెద్ద ఛాలెంజ్
మారిందన్నారు. జిల్లా పోలీసుశాఖ సంకల్పం కార్యక్రమాలతోను, ప్రచార రధంతోను విద్యార్థులను, ప్రజలను
చైతన్యపరుస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావం ఏవిధంగా ఉంటుంది, కెరియర్, మానవ జీవితాలను ఏవిధంగా
నాశనం అవుతాయన్న విషయాలపట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒకసారి డ్రగ్స్ ను వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో విద్యార్థులు ఉంటారని, కాని డ్రగ్స్ వినియోగించడం ప్రారంభిస్తే త్వరితగతిన బానిసలుగా
మారుతారన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. డ్రగ్స్కు బానిసలుగా మారిన యువతకు వారి చెడు అలవాట్లు
కు సరిపడే డబ్బులు లేక చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడి దురదృష్టవసాత్తు నేరస్థులుగా మారుతున్నారన్నారు. జిల్లాలో
ఇప్పటికే 200కేసులు నమోదు చేసి, 360 మందిని అరెస్టు చేసి, పెద్దసంఖ్యలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.అదే విధంగా వారిపై హిస్టరీ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు.
గంజాయిని ఎవరైనా వినియోగించినా, విక్రయించినా, అక్రమ రవాణకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ - యువతను సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీగారు సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టి, యువతను మత్తు, మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చర్యలు చేపట్టడం
అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలని, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని
కోరారు.
ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొంప కృష్ణ, వెంకట పద్మ ఆసుపత్రి వైద్యులు డా.వెంకటేశ్వరరావు, రాజాం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి స్వప్న హైందవి, మోటివేషనల్
స్పీకరు శ్రీనివాస్ సోను ప్రసంగించి, విద్యార్ధులు, యువతకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించి, కుటుంబాలను నాశనంచేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాకర్ల అప్పలరాజు అలియాస్ గాంధీ మాస్టర్ మరియు పల్సర్ బైకు రమణ యువతను మాదక ద్రవ్యాలవైపు ఆకర్షితులు కాకుండా ఆలపించిన గీతాలు యువతను ఎంతగానో చైతన్యపర్చాయి. అదే విధంగా విద్యార్ధులు కోట జంక్షను వద్ద నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కూడా ప్రజలను, యువతను ఆకట్టుకున్నాయి. లీప్యారడైజ్లో
ఏర్పాటు చేసిన సెల్ఫీ ఫ్లెక్సీలో యువత గంజాయి దూరంగా ఉంటామని తెలుపుతూ ఫోటోలు, సంతకాలు చేసేందుకు
ఆసక్తి కనబర్చారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత యువతతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాచారాన్ని
పోలీసుశాఖకు అందిస్తామని ప్రతిజ్ఞ చేసారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్స్ ను
రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి ఆవిష్కరించారు.
ఈ ర్యాలీలో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, జిల్లా కలెక్టరు డా. బి.ఆర్. అంబేద్కర్, జిల్లా ఎస్పీ
వకుల్ జిందల్, స్థానిక ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, అదనపు ఎస్పీ
(అడ్మిన్) పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎం.శ్రీనివాస రావు, ఆర్. గోవిందరావు, వీరకుమార్, రవీంద్రా రెడ్డి, ఇతర పోలీసు
అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.