రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు: 36 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు

IAS Transfers Telangana Telangana IAS officers N Sridhar Lokesh Kumar Harichandana Dasari
Mounikadesk

 IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు: 36 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు

  • తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు..
  • మొత్తం 36 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు..
  • హైదరాబాద్ కొత్త కలెక్టర్‌గా హరిచందన దాసరి నియామకం..
  • పలువురు ముఖ్య కార్యదర్శులు, వివిధ జిల్లాల కలెక్టర్ల మార్పు..
  • కీలక శాఖలకు నూతన సారథులు, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశం..


తెలంగాణ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల ద్వారా మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. వీరిలో పలువురు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎన్. శ్రీధర్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆయనకు గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. లోకేశ్‌ కుమార్‌ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా, నవీన్‌ మిత్తల్‌ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్ నియమితులయ్యారు. శశాంక్‌ గోయల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా హరిచందన దాసరి నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్ జనరల్‌ (ఐజీ)గా రాజీవ్‌గాంధీ హనుమంతుకు బాధ్యతలు అప్పగించారు. సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా కిల్లు శివకుమార్‌ నాయుడు నియమితులయ్యారు. సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మిని, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా ఇ.నవీన్‌ నికోలస్‌ను ప్రభుత్వం నియమించింది.

టి. వినయ్‌ కృష్ణారెడ్డి నిజామాబాద్‌ కలెక్టర్‌గా, సృజన మహిళాశిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌గా (అదనపు బాధ్యతలు), ఎల్‌.శివశంకర్‌ వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా (విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. సిద్దిపేట కలెక్టర్‌గా కె.హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పి.గౌతమ్‌, ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా కె.నిఖిల, పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) వల్లూరు క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా పి.ఉదయ్‌ కుమార్‌ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావిణ్య, మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్‌, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌గా ముజామిల్‌ ఖాన్‌ నియమితులయ్యారు.



Comments

-Advertisement-