పీ4 పై సీఎం కీలక సమీక్ష
పీ4 పై సీఎం కీలక సమీక్ష
జిల్లాలో 65,451'బంగారు కుటుంబాలు' గుర్తింపు
జూలై 15 లోపు లక్ష్యాన్ని చేరుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
చిత్తూరు, జూలై 4 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 (పబ్లిక్, ఫిలాంత్రపిస్ట్, పీపుల్ పార్టిసిపేషన్) కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షలో, పీ4 పురోగతిపై సీఎం దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షకు చిత్తూరు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ నరేంద్రపాడల్,పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం నేరుగా కార్యక్రమ పురోగతిపై ఆరా తీశారు.
జిల్లాలో 65,451'బంగారు కుటుంబాలు' గుర్తింపు .. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి:
సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. జిల్లాలో మొత్తం 65,451 బంగారు కుటుంబాలు గుర్తించినట్లు వెల్లడించారు. వీటిలో కుటుంబాలను దత్తత తీసుకున్నారని, ఇంకా కుటుంబాలు దత్తత కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోపు 1,93,424 కుటుంబాల దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేసామని అన్నారు.
నియోజకవర్గాల వారీగా వివరాలను వెల్లడిస్తూ చిత్తూరు - 7,953, గంగాధర నెల్లూరు (ఎస్ సి)-11,573, కుప్పం -10,407, నగరి- 5135, పలమనేరు -10,106, పుంగనూరు -9,541, పూతలపట్టు -10,736 మొత్తం : 65,451 కుటుంబాలు ఉన్నట్లు వివరించారు.
పీ4 కేవలం దాతృత్వ కార్యక్రమం కాదని, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించి, స్వయంగా ఇతర గ్రామాలకు సహాయపడే శాశ్వత సామాజిక ఉద్యమంగా భావించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్య సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. జూలై 15 నాటికి 1,93,424 కుటుంబాలను దత్తత చేయడం జిల్లాలో ప్రస్తుత ప్రాధాన్యతగా ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో
సిపీఓ.శ్రీనివాసులు, జిల్లా ప్రణాళిక అధికారి కార్యాలయపు ఏడి బి.సాంబశివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.