రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పోరాటాలకు నిరంత స్ఫూర్తి అల్లూరి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 పోరాటాలకు నిరంత స్ఫూర్తి అల్లూరి

128వ అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకొని నర్సీపట్నంలో అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించి, ఘన నివాళుల్పరించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్

అనంతరం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి అమరవీరుల స్మృతివనంలో జయంతి వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్, ఎస్పీ తూహిన్ సిన్హా

అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు

అల్లూరి ఆశయ సాధనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు

టఅల్లూరి అసువులు బాసిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

అనకాపల్లి జిల్లాను టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని హామీ

నర్సీపట్నం: అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి పురస్కరించుకొని మన్యం జిల్లా ముఖద్వారం నర్సీపట్నంలో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 10 అడుగుల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, తదితరులు శుక్రవారం ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి అమరవీరుల స్మృతివనంలో జయంతి వేడుకల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, అప్పలనాయుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్, ఎస్పీ తూహిన్ సిన్హా, తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తొలితరం స్వతంత్ర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.గిరిజన ప్రాంతాల్లో మహోద్యమం నడిపించి, ఆదివాసీల హక్కులు, దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి వీరోచిత పోరాటం చేశారని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి పని చేయాలన్నారు. అల్లూరి పుట్టిన ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరికి కట్టుబడి ఉండాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని పుణ్యక్షేత్రాలను, సందర్శనీయ ప్రదేశాలను కలుపుకొని సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు అసువులు బాసిన ఘాట్ సహా సమీప ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా మాత్రమే అల్లూరికి అసలైన నివాళి అర్పించినవాళ్లమవుతామని మంత్రి దుర్గేష్ అన్నారు.

తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక అయిన అల్లూరి సీతారామరాజు జయంతిని నేడు అన్ని ప్రాంతాల్లో అధికారికంగా నిర్వహించుకోవడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఘనుడు అని పేర్కొన్నారు.ఆయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని తెలిపారు.పరాయి పీడనలో మగ్గుతున్న భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు ప్రాణాలు త్యజించిన వారి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని అన్నారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి, చేసిన పోరాటాలు ఆదర్శమని తెలిపారు. గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి అన్నారు. గొరిల్లా యుద్ధరీతుల్లో ఆరితేరిన మహామనిషి అల్లూరి అన్నారు. అల్లూరి తాను బతకాలని అనుకుంటే బ్రిటీష్ వారికి దొరికేవాడు కాదని వివరించారు. తన ప్రజల మాన, ప్రాణాలను కాపాడటం కోసం తుపాకీకి గుండె చూపించి వీరమరణం పొందిన మహనీయుడు, త్యాగశీలి మన అల్లూరి అని పేర్కొన్నారు. ఆయన త్యాగనిరతిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అల్లూరి స్పూర్తి ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులకు అల్లూరి స్పూర్తి అని తెలిపారు. అతి చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి అడుగుపెట్టిన అల్లూరి స్ఫూర్తిని యువత పుణికిపుచ్చుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరంతో అల్లూరి అనుబంధాన్ని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. అల్లూరిపట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు ఉన్న అభిమానాన్ని చాటుకునే అభివృద్ధి కార్యక్రమానికి తాము సహకారం అందిస్తామన్నారు.

అనంతరం ప్రసంగించిన స్పీకర్, మంత్రులు, ఎంపీలు అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని, ఆశయాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా అల్లూరి స్మృతి వనం కోసం తమ సొంత నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులను అభినందించారు. నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-