రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాజధానిలోనే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాజధానిలోనే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-ఏర్పాట్లపై సమీక్షించిన సిఎస్ 

అమరావతి,23 జూలై:ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల పి-4,ప్రప్రంచ జనాభా దినోత్సవ వేడుకులు నిర్వహించిన ప్రాంతంలో స్వాంత్రంత్ర్య దినోత్సవ వేడుకలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని కావున అందుకు అనుగుణంగా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.రాజధాని నడిబొడ్డు ప్రాంగణంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకైన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతంలోను వర్షాకాలంలోను నిర్వహించనున్నందున ఈకార్యక్రమం విజయవంతానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజాయనంద్ అధికారులకు స్పష్టం చేశారు.

రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా వర్షాకాలమైనందున వేడుకల నిర్వహణకు తగిన రీతిలో ప్రాంగణమంతా లెవెలింగ్ చేయడంతో పాటు ప్రధాన వేదిక తోపాటు,ఇతర సీటింగ్ ఏర్పాట్లు వద్ద జర్మన్ టెంట్లు వేయించాని,వాహనాల పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని సిఆర్డిఏ కమీషనర్ కన్నబాబును ఆదేశించారు.ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు డిజిపి మదుసూదన్ రెడ్డిని ఆదేశించారు. అదే విధంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ,ప్రోటోకాల్ సంబందిత అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపధ్యంలో రాజ్ భవన్,సియం క్యాంపు కార్యాలయం,రాష్ట్ర సచివాలయం,అసెంబ్లీ,హైకోర్టు భవనాలు సహా ఇతర చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని సిఆర్డిఏ,ఆర్అండ్బి,ఎపి ట్రాన్సుకో అధికారులను ఆదేశించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల కార్యక్రమాలు,పధకాలపై ప్రత్యేక శకటాల ప్రదర్శన(టాబ్లూస్)ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని సమచారశాఖ అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.అంతేగాక అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుపై ముఖ్య అతిధి సందేశం,వివిధ ప్రసార మాద్యమాల ద్వారా వేడులపై లైవ్ కవరేజి తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలన చెప్పారు.

అంతకు ముందు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మినిట్ టు మినిట్ కార్యక్రమం గురించి వివరిస్తూ ఆరోజు ఉదయం 8.30 గం.లకు స్వాతంత్ర్య దినోత్సవ పేరేడ్ ప్రారంభం అవుతుందని 8.58గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటారని ఉ.10.30 గం.ల వరకూ ఈవేడుకులు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.

ఈసమావేశంలో సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు,ఐఅండ్పిఆర్ జెడి పి.కిరణ్ కుమార్, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా ఆర్డ్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి,అదనపు డిజిపి శాంతిభత్రలు మదుసూదన్ రెడ్డి తదితర శాఖల అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.

Comments

-Advertisement-