Benefits Honey: రోజూ తేనెను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..?
Benefits Honey: రోజూ తేనెను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..?
ప్రకృతి మనకు అందించిన అనేక సహజసిద్ధమైన ఆహారాల్లో తేనె కూడా ఒకటి. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఔషధంగా తేనెను ఉపయోగిస్తారు.
ప్రకృతి మనకు అందించిన అనేక సహజసిద్ధమైన ఆహారాల్లో తేనె కూడా ఒకటి. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఔషధంగా తేనెను ఉపయోగిస్తారు. ఇతర మూలికలతో దీన్ని కలిపి తీసుకుంటారు. తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వర్షాకాలంలో రోజూ తేనె తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఈ సీజన్‌లో మనకు కలిగే వ్యాధులను తగ్గించడంలో సహాయం చేస్తాయని అంటున్నారు. తేనెను రోజూ ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి కూడా తేనెను తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
రోగ నిరోధక శక్తికి..
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల బి విటమిన్లు, విటమిన్ సి, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే తేనె తీసుకోవడం వల్ల శరీరం వ్యాధి నిరోధకశ శక్తిని పెంచుకుని రోగాలు, ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేనె దగ్గుకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పూటకు ఒక టీస్పూన్ చొప్పున తేనెను తీసుకుంటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే జలుబు, గొంతులో గరగర, మంట, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
జీర్ణ సమస్యలకు..
వర్షాకాలంలో కలుషిత ఆహారం, నీరు వంటివి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. విరేచనాలు తలెత్తుతాయి. అయితే తేనె వీటికి చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. తేనెను తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ నుంచి కోలుకుంటారు. జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. తేనె మన శరీరానికి సహజసిద్ధంగా శక్తిని అందిస్తుంది. ఉదయం తేనెను తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా మారుతుంది. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి. రోజంతా తిరిగే వారు లేదా శారీరక శ్రమ చేసేవారు ఉదయం తేనె తీసుకుంటే నీరసం, అలసట రాకుండా చూసుకోవచ్చు.
శ్వాసకోశ సమస్యలకు..
తేనెలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ నశిస్తాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. చర్మ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. వర్షాకాలం సీజన్‌లో చాలా మందికి చర్మ సమస్యలు వస్తుంటాయి. కానీ తేనె తీసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనెను తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గిపోతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఈ విధంగా ఈ సీజన్‌లో తేనెను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.