రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
భారతీయులు చాలా మంది టీ ప్రియులు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు టీ ని పదే పదే తాగుతారు. అయితే వాస్తవానికి టీ కన్నా బ్లాక్ కాఫీ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. చక్కెర, పాలు కలపకుండా తయారు చేసే దాన్నే బ్లాక్ కాఫీ అంటారు.
భారతీయులు చాలా మంది టీ ప్రియులు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు టీ ని పదే పదే తాగుతారు. అయితే వాస్తవానికి టీ కన్నా బ్లాక్ కాఫీ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. చక్కెర, పాలు కలపకుండా తయారు చేసే దాన్నే బ్లాక్ కాఫీ అంటారు. విదేశీయులు బ్లాక్ కాఫీని ఎక్కువగా సేవిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా చాలా మంది సాధారణ టీ, కాఫీలకు బదులుగా బ్లాక్ కాఫీని సేవిస్తారు. అయితే సాధారణ టీ, కాఫీ కన్నా బ్లాక్ కాఫీ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. రోజువారి ఆహారంలో బ్లాక్ కాఫీని భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు.
నాడీ మండల వ్యవస్థకు..
ఒక కప్పు బ్లాక్ కాఫీని సేవిస్తే కేవలం 2 నుంచి 5 క్యాలరీల శక్తి మాత్రమే మనకు లభిస్తుంది. ఇందులో కొవ్వులు అసలు ఉండవ. పిండి పదార్థాలు లభించవు. ప్రోటీన్లు 0.3 గ్రాముల మేర లభిస్తాయి. బ్లాక్ కాఫీని సేవిస్తే విటమిన్లు బి2, బి3, బి1, బి9లతోపాటు పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, సోడియం, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్లాక్ కాఫీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 1000కి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ నాడీ మండల వ్యవస్థను ఉత్తేజం చేస్తుంది. దీంతో న్యూరో ట్రాన్స్‌మిటర్లు యాక్టివ్ అవుతాయి. ఇవి అప్రమత్తతను పెంచుతాయి. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
షుగర్ లెవెల్స్ తగ్గుముఖం..
బ్లాక్ కాఫీని సేవిస్తే రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. బ్లాక్ కాఫీని రోజూ సేవిస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. అంతేకాదు, షుగర్ ఉన్నవారు చక్కెర కలపకుండా బ్లాక్ కాఫీని సేవిస్తుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. బ్లాక్ కాఫీని తరచూ సేవించడం వల్ల లివర్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. లివర్ వాపులకు గురి కాకుండా సురక్షితంగా ఉంటుంది.
బరువు నియంత్రణ..
బ్లాక్ కాఫీని సేవించడం వల్ల అందులో ఉండే కెఫీన్ తాత్కాలికంగా బీపీని పెంచుతుంది. అయితే ఇది గుండెకు మేలే చేస్తుంది. కానీ హైబీపీ ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచన మేరకు మాత్రమే బ్లాక్ కాఫీని సేవించాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ కాఫీని సేవించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా రక్షిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని రోజూ సేవిస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దీన వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బ్లాక్ కాఫీ వల్ల ప్రయోజనం పొందాలంటే దాన్ని చక్కెర లేకుండా తాగాల్సి ఉంటుంది. అలాగే ఈ కాఫీని సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసికంగా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. ఇలా బ్లాక్ కాఫీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.