రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సంధర్బంగా జులై నెల చివరి శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
- ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
- వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు,వాహనానికి కావలసిన సరైన దృవపత్రాలు కలిగి ఉండాలి.
- సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.
- మధ్యం సేవించి వాహనాలు నడుపరాదు.
- నిభందనలకు వ్యతిరేకంగా వన్ వే లో రాంగ్ రూట్ ప్రయాణం చెయ్యరాదు.
- ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయడం, డ్రైవర్ కు ఇరు ప్రక్కన కూర్చోవడం వంటివి చేయరాదు.
- మితిమీరిన వేగంతో వాహనాలు నడుపరాడు.
- ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయరాదు.
- వాహనాలకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చెయ్యాలి.
- రహదారి ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదములు జరగటం వలన మరణాలు అంగవైకల్యాలు సంభవిస్తున్నాయి కావున ప్రతి ఒక్కరూ వేగం వద్దు ప్రాణం ముద్దు అనే విషయాన్ని గ్రహించి సురక్షితంగా గమ్యం చేరాలని తెలియజేశారు.