రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జాతీయ రోడ్ల నిర్మాణాల్లో ఇరువైపుల పచ్చదనం ఉండే విధంగా ప్రణాళిక అమలు చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జాతీయ రోడ్ల నిర్మాణాల్లో ఇరువైపుల పచ్చదనం ఉండే విధంగా ప్రణాళిక అమలు చేయాలి

  • వన్యప్రాణుల కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది
  • ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం అడవి భూముల ద్వారా వెళ్తే అటవీ నిబంధన ప్రకారం పర్యావరణాన్ని మొత్తం తప్పనిసరి
  • కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్చి

త్తూరు జూలై 26: ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళితే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయలు తెలిపారు 

శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్ మరియు టేకుమంద ఎక్స్ టెన్షన్ లో నిర్మిస్తున్న నాలుగు లైన్ల బెంగళూరు చెన్నై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రెండవ విడత పనులపై రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీధర్ తో కలిసి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అనంతపురం తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోద భాయ్ సెల్వం, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి మరియు రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టడంలో భాగంగా వన్యప్రాణులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారులను నిర్మించాలని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాల మేరకు రహదారి వెంబడి అనుకూలించిన ప్రదేశాలలో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు హండ్రపాసులు నిర్మించాలని తెలిపారు. ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వే ను వన్యప్రాణులు అడ్డంగా దాటకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి ఏనుగుల కోసం కర్ణాటక ఆర్టీసీ శాఖ బందిపూర్ మరియు నాగర్హ హోల్ నేషనల్ పార్కులలో అమలు చేసిన యాంత్రిక రైల్వే అడ్డంకి రూపకల్పన విధానంను జిల్లాలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాణులు దాటి దగ్గర రహదారికి కింది వైపుగా చైన్ లింక్ ఫెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా చిరుతలు స్లాక్ బీర్స్ వంటి వన్యప్రాణులకు అనుకూలిస్తుందని తెలిపారు. వన్యప్రాణుల కదలిక అధ్యయనానికి ఎన్ హెచ్ ఎఐ నుండి నిధులు సమకూర్చి జిపిఎస్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ వినియోగించి ప్రాంతీయ సంస్థలు పరిశోధకులు వన్యప్రాణుల సంరక్షణ అధికారి జిల్లా అటవీ అధికారి మరియు ఫీల్డ్ సిబ్బందిని కలుపుకొని ఒక పరిశోధనా ప్రాజెక్టును అమలు చేయాలన్నారు. జీవవైవిద్యాన్ని పరిరక్షించుటకు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పది కిలోమీటర్ల లోపల వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ స్పందన బృందాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా అడవులు తరుగుతున్న నేపథ్యంలో అందుకు సమాన స్థలంలో పున అటవీకరణ బాధ్యత చేపట్టాలన్నారు. దీంతో పాటు ప్రభావిత గ్రామాల నివాస్తులకు పునరావాస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. నిర్మాణ దశలోనూ మరియు పూర్తయిన తర్వాత ఎక్స్ ప్రెస్ వే వల్ల అడవులు, ప్రకృతి పై పడే ప్రభావాన్ని నిరంతరం పరిరక్షిస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

Comments

-Advertisement-