గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు నియామకం...
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు నియామకం...
కేంద్ర ప్రభుత్వం జులై 14న మూడు రాష్ట్రాలకు గవర్నర్ లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నరు నియమించింది. ఈ నియామకాల్లో భాగంగా గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
గోవా గవర్నర్ గా పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై స్థానంలో అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. శ్రీధరన్ పిళ్ళై జూలై 2021లో బాధ్యతలు స్వీకరించారు.
అశోక్ గజపతి రాజు గతంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు (మే 2014 - మార్చి 2018).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014లో విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అశోక్ గజపతి రాజు విజయనగరం సంస్థానానికి చెందిన రాజవంశీకులు. ఆయన విజయనగరం చివరి మహారాజు పూసపాటి విజయరామ గజపతి రాజు చిన్న కుమారుడు.
ఇతర నియామకాలు:
హర్యానా గవర్నర్: ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్ (పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, 1999-2002) హర్యానా గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసినందున ఈ నియామకం జరిగింది.
లాభదాయకమైన పదవిలో ఉండకూడదు.
గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. ఆయన నామమాత్రపు అధిపతి, అయితే నిజమైన అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వారి మంత్రిమండలికి ఉంటుంది. గవర్నర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు
లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకం:
గవర్నర్ మాదిరిగానే లెఫ్టినెంట్ గవర్నర్ ను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు.
లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఐదేళ్ల కాలానికి నియమించబడతారు మరియు రాష్ట్రపతి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లడఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి వంటివి) ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు
మణిపూర్ గవర్నర్: అజయ్ కుమార్ భల్లా
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. బి.డి. మిశ్రా రాజీనామా చేయడంతో ఈ స్థానం భర్తీ అయింది.
గవర్నర్ నియామకం:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారం ఒక రాష్ట్రానికి గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
గవర్నర్ ఐదేళ్ల కాలానికి నియమించబడతారు అయితే రాష్ట్రపతి ఇష్టానుసారం పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి ఎప్పుడైనా వారిని తొలగించవచ్చు. గవర్నర్ రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించడం ద్వారా కూడా తమ పదవికి రాజీనామా చేయవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 157 మరియు 158 గవర్నర్ పదవికి అవసరమైన అర్హతలను పేర్కొంటాయి:
భారతదేశ పౌరుడై ఉండాలి.
కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి.
పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే, గవర్నర్గా బాధ్యతలు స్వీకరించే ముందు ఆ పదవికి రాజీనామా చేయాలి.