మ్యాపింగ్ లో లేని అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు తక్షణమే ఎన్ పి సి ఐ లో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి
మ్యాపింగ్ లో లేని అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు తక్షణమే ఎన్ పి సి ఐ లో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి
డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
అన్నదాత సుఖీభవ లబ్ధిదారులలో అధికభాగం ఎన్ పి సి ఐ లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపిన ఎన్ పి సి ఐ.
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా ఎన్ పి సి ఐ లో మ్యాపింగ్ - రైతు డేటాను అనుసంధానించటం మరియు ఈ కే వై సి eKYC స్థితి పై కొన్ని సూచనలను తెలిపింది అని అన్నారు .
వారు తెలిపిన సమాచారం మేరకు ఆధార్ ఆధారముగా లబ్ధి దారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలవుతున్న అన్నదాత సుఖీభవ పథకంలో ఈకేవైసి పూర్తిచేసిన లబ్ధిదారుల డేటాను ఎన్ పీసిఐ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కొన్ని రకాల సూచనలను తెలిపింది అని వారి పరిశీలనల అంశాలను తెలుపుతూ రాష్ట్రములో ఇప్పటివరకు ఈ పథకం కింద 47,41,792 మంది రైతుల ఈకేవైసి పూర్తి అయ్యిందని తెలిపారు . ఆ ఈకేవైసి పూర్తిచేసుకున్న రైతుల సమాచారాన్ని ఆర్ టి జి ఎస్ యస్ -RTGS వారు ఎన్ పి సి ఐ తో కలసి ఆ రైతుల ఖాతాల ప్రస్తుత వినియోగపు స్థితిని క్షుణ్ణంగా పరిశీలించి ,వడపోసిన తరువాత వాటిలో కింద తెలిపిన విధముగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది
76,705 లబ్ధిదారులు NPCI - బ్యాంకు లలో ఎటువంటి లావా దేవీలు జరపకుండా క్రియాశీలకంగా లేరు INACTIVE నిస్తేజపు ఖాతాలుగా వున్నారు .
అందుచేత వీరు తక్షణమే సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి eKYC చేయించుకోవాలి లేదా తాజా లావాదేవీలు చెయ్యటం ద్వారా NPCI యాక్టివేషన్ - పునరుద్ధించుకోవచ్చు అని తెలిపారు
44,977 లబ్ధిదారుల డేటా NPCI లో కనిపించలేదు. Data Not Found
తక్షణమే వారు ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయించి , NPCI లో మ్యాపింగ్ చేయించుకోవాలి.
రైతు వివరములతో కూడుకున్న పై రెండిటి సమాచారం సంబంధిత రైతు సేవా కేంద్రాలలో మరియు వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉందని తెలిపారు .
డిల్లీ రావు మాట్లాడుతూ రాష్ట్రములోని అర్హత ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
జిల్లా వ్యవసాయ అధికారులందరు ఈ విషయాన్ని అతి సున్నితమైన , ముఖ్యమైన అంశముగా చేసుకుని పర్యవేక్షణ చేయాలని ,మిగిలిన అర్హత ఉన్న కొద్దిపాటి రైతులను (1,21682) తాజా లావాదేవీలు జరిపించడం మరియు ఆధార్ అనుసంధానం అయ్యేటట్లు చేసి ఎన్ పి సి ఐ లో మ్యాపింగ్ అయ్యేటట్లు చూడాలని ఆదేశించారు .ఈ ప్రక్రియ త్వరగా చేబట్టడం ద్వారా సేకరించిన డేటాను ఆర్ టి జి ఎస్ RTGS మరియు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు మరియు సేవల కేంద్రం ( APCFSS) లు సంయుక్తంగా పరిశీలించి తుది జాబితా తయారు ప్రక్రియ వుంటుంది కాబట్టి
జిల్లా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి దిగువ సిబ్బందికి అవగాహన తో కూడుకున్న దిశానిర్దేశం చేసి , సదరు రెండు తరగతుల రైతులను బ్యాంకులకు పంపించేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు .