హెల్మెట్ బరువు కాదు బాధ్యత - హెల్మెట్ తో ప్రాణాలకు రక్ష..
హెల్మెట్ బరువు కాదు బాధ్యత - హెల్మెట్ తో ప్రాణాలకు రక్ష..
- ఫోన్ పగిలితే మరొకటి కొనుక్కోవచ్చు - తల పగిలితే జీవితాన్నే కోల్పోతాం..
- ఒక వ్యక్తి మరణం వల్ల, ఆ కుటుంబ భవిష్యత్తు జీవిత కాలం దూరమవుతుంది.
- ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి..
- ట్రాఫిక్ విధులు, పెట్రోలింక్,
- మహిళల భద్రత కోసం 16 నూతన వాహనాలు..
- వాహనాలు ప్రారంభించి, హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్,..
రాయచోటి, జులై 23: ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్, ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది కోసం, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ద్విచక్ర వాహనాలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్,. ఆదేశాల మేరకు 16 వాహనాలను అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. వాటిని బుధవారం స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
అనంతరం ప్రజలకు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి. అవగాహన కల్పించే విధంగా, ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులతో కలసి హెల్మెట్ ధరించి పోలీసు ప్రధాన కార్యాలయం నుండి, మాసాపేట, ఠాణా సర్కిల్, బంగ్లా సర్కిల్, శివాలయం సర్కిల్ వరకూ.. తిరిగి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వరకూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత అన్నారు హెల్మెట్ తో పాటు క్లిప్ పెట్టుకోవడం కూడా ముఖ్యమేనన్నారు. హెల్మెట్ ను నిబంధనల కోసం కాదు, ప్రాణ రక్షణ కోసం ధరించాలన్నారు. చిన్న తప్పిదంతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. మూడు, నాలుగేళ్లు ఉండే మొబైల్ ఫోన్ కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.. పడ్డా పగిలిపోకుండా ఖరీదైన స్క్రీన్ గార్డు వేయిస్తాం... మరి ఎంతో విలువైన జీవితం మాటేంటీ? చాలామంది జుట్టు ఊడుతుందనో.. తలపై బరువు అనో.. వెళ్లేది తక్కువ దూరమే అన్న కారణంతోనో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. ఇది నిబంధనల్ని ఉల్లంఘించడమే కాదు.. విలువైన ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టడమే. కొందరు చలాన్ల భయంతో హెల్మెట్ కొంటున్నా నాణ్యత ఉండదు. ఫోన్ పగిలితే మరోటి కొనుక్కోవచ్చు. తల పగిలితే జీవితాన్నే కోల్పోతాం, మన పై ఆధారపడ్డవాళ్లను రోడ్డున పడేసినట్లే.. అందుకే హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రాణాంతకమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని, తలకు బలమైన గాయాలే ఎక్కువ మరణాలకు కారణం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలన్నారు. తలకు గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు వేగవంతంగా ఆ ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు సహాయం అందించడానికి, పోలీసు సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, రోడ్డు సేఫ్టీ, మహిళల రక్షణ కోసం, నైట్ పెట్రోలింగ్, డే బీట్స్ కోసం, జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, సాయంత్రం వేళ కళాశాలల పరిధిలో మహిళల భద్రత కోసం, అనుకూలంగా ఉండే 16 ద్విచక్ర వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కార్యాలయం నుండి అన్నమయ్య జిల్లాకు కేటాయించారన్నారు. వాటిలో ఒక రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ 350 (బుల్లెట్) టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 160 ద్విచక్ర వాహనాలు 15 ఉన్నాయన్నారు. వీటికి పోలీస్ సైరన్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ప్రధమ చికిత్స కిట్ లతో పాటు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రాజంపేట , రాయచోటి, మదనపల్లి సబ్ డివిజన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి, పెట్రోలింగ్ నిర్వహించేందుకు, మహిళల భద్రతకు, ఈ ద్విచక్ర వాహనాలను వినియోగిస్తామన్నారు. నూతన ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీస్ సిబ్బందికి వారి విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే డయల్ 112 కు కాల్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం.వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, మదనపల్లి డిఎస్పీ ఎస్.మహేంద్ర. రాయచోటి డిఎస్పీ. యం.ఆర్. కృష్ణమోహన్, ఏఆర్ డిఎస్పీ యం. శ్రీనివాసులు, సీఐ లు, ఆర్ ఐ లు, ఎస్ఐ లు, ఆర్ ఎస్ఐ లు, ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.