రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందని విధంగా రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్అభివృద్ధి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందని విధంగా రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్అభివృద్ధి

  • కర్నూలు విమానాశ్రయం నుండి కర్నూలు- విజయవాడ విమాన సర్వీస్ లు ప్రారంభం
  • వారం లో 3 రోజుల పాటు విమాన సర్వీస్ లు
  • కర్నూలు జిల్లా ప్రజలు ఈ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలి
  • కర్నూలు ఎయిర్ పోర్టు అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటాం
  • కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు


కర్నూలు, జూలై 02 (పీపుల్స్ మోటివేషన్):- ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

బుధవారం కర్నూలు ఎయిర్పోర్ట్ లో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీస్ లను కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఢిల్లీ నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. కర్నూలు ఎయిర్ పోర్టు నుండి రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఇంచార్జి కలెక్టర్ డా. బి.నవ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కర్నూలుకి సంబంధించి విజయవాడ కి కనెక్టివిటీ ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. విజయవాడ - కర్నూలు ఫ్లైట్ ఎప్పుడు వేస్తారని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అడుగుతూనే ఉన్నారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలకు, అనంతపురం జిల్లాకు ఈ కనెక్టివిటీ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కొత్త ఎయిర్పోర్ట్ లను అభివృద్ధి చేయడం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్నారు. ఏ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయాలని, ఒక లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని, సీఎం ఎంతో పట్టుదలతో ఉన్నారన్నారు..  

విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఇప్పుడు కర్నూలు, అలాగే కడపలో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో గతంలో కంటే ఈ సంవత్సరం కాలంలో అదనంగా ఫ్లైట్ సర్వీస్ లు స్టార్ట్ చేసి సుమారు 15% ఎడిషనల్ కెపాసిటీని మన రాష్ట్రం నుండి పెంచామన్నారు.. అదే విధంగా సివిల్ ఏవియేషన్ లో భోగాపురం, నెల్లూరు, అనంతపూర్, కుప్పం ఇలా రకరకాల ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్ లు స్టార్ట్ చేయడానికి చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో ముందుకు నడిపించడం జరుగుతుందన్నారు..అదే విధంగా కర్నూలు ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయాలని సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సలహాలు ఇవ్వడం జరుగుతోందన్నారు..ప్రస్తుతం ఈ సర్వీస్ 3 రోజులు నడిచేలా ప్రారంభించామని, అతి త్వరలో. 7 రోజులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు..

కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి అదనపు కనెక్టివిటీ లు ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు... కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.. కర్నూలు నుండి అనంతపురం వరకు 5 ముఖ్యమైన ఇండస్ట్రియల్ రంగాలఅభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు..ముఖ్యంగా ఓర్వకల్లు నోడ్ లో డ్రోన్ హబ్ ను తయారు చేయాలని, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్, డిఫెన్స్ తదితర ఇండస్ట్రియల్ సెక్టార్ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.. కర్నూలు ప్రాంతం అభివృద్ధి చెందడంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోసిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.. కర్నూలు జిల్లా ప్రజలు ఈ సర్వీసును సద్వినియోగం చేసుకొని 100% ఆక్యుపెన్సీ ఉండే విధంగా సహకరించాలని, ఎయిర్ పోర్ట్ సేవలను ప్రోత్సహించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు..

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు - విజయవాడ ఫ్లైట్ ను ప్రారంభించిన ఇండిగో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.. తాను కట్టించిన ఎయిర్పోర్ట్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అదేవిధంగా ఇంకా పలు ప్రాంతాలలకు ఫ్లైట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతామని, వాటిని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు..అదేవిధంగా కర్నూలు ఎయిర్ పోర్ట్ లో నైట్ ల్యాండింగ్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా మారుతున్నందున రాబోయే కాలంలో ఇది చాలా అవసరమని తెలిపారు.. కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి ప్రతిరోజు ఫ్లైట్లు తిరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ఉదయం ఏడు గంటలకు ఇక్కడ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు వెళ్లే విధంగా, అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు వచ్చే విధంగా ఫ్లైట్ టైమింగ్స్ మార్చాలని మంత్రి కేంద్ర మంత్రిని కోరారు..

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు - విజయవాడ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు.. ఈ సర్వీసులను ప్రారంభించడం పట్ల అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు సంతోషపడుతున్నారని తెలిపారు.. అదే విధంగా కర్నూలు ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ ఏర్పాటుకు కూడా కృషిచేయాలని మంత్రి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ఉండడం వల్ల చాలామంది పారిశ్రామికవేత్తలు తరచుగా ప్రయాణించవలసిన అవసరం ఉంటుందని, అందువల్ల కర్నూలు ఎయిర్పోర్ట్ లో నైట్ లాండింగ్ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇదే రోజు ఓర్వకల్లు విమానాశ్రయం నుండి విజయవాడకు కొత్త విమాన సర్వీసు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంవత్సరం లోనే ఇది సాధించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మరింత అభివృద్ధితో ఈ విమానాశ్రయం రూపు రేఖలు మార్చాలని, l నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా కల్పించాలని పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి ని కోరారు.

నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ కర్నూలు నుండి విజయవాడ కు విమాన సర్వీసులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని, నైట్ ల్యాండింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

కర్నూలు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ గా పేరును అధికారికంగా ప్రకటించేలా ఎంపీ కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ కర్నూలు విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి వల్లే ఈ ప్రాంతము ఇండస్ట్రియల్ హబ్ గా రూపొందిందని, కర్నూలు ఎయిర్పోర్ట్ ఏర్పాటు అయిందని ఎమ్మెల్యే తెలిపారు. విజయవాడ వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, ఈ సర్వీసులను ప్రారంభించడం వల్ల పారిశ్రామికవేత్తలకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు చాలా ఉపయోగముంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ముందుగా కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, కర్నూలు విజయవాడ ఇండిగో విమాన సర్వీస్ లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భీమప్ప పూజారి అనే ప్యాసింజర్ కి మొదటి బోర్డింగ్ టికెట్ ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ అందచేశారు.

కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ డా. బి.నవ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, ఇండిగో కంపెనీ రీజినల్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ జిబు జాన్, అసిస్టెంట్ మేనేజర్, కౌశల్, రీజినల్ మేనేజర్, ప్రశాంత్ , రీజినల్ మేనేజర్ సేఫ్టీ జాక్సన్ జార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.





Comments

-Advertisement-