గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగలగొట్టిన కేసులో ముద్దాయిలు అరెస్టు..
గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగలగొట్టిన కేసులో ముద్దాయిలు అరెస్టు..
పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులు అరెస్టు..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీ.వి.రమణ
పెనగలూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్, 69/2025.U/s. 427,447,303 (2) IPC S.20 ఇండియన్ ట్రెజరీ ట్రూ 1878 యాక్ట్ క్రింద నమోదు..
అన్నమయ్య జిల్లా, పీపుల్స్ మోటివేషన్:-
అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట ఏఎస్పీ శ్రీ. మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ గారి సూచనలతో రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ బీ.వీ.రమణ, పెనగలూరు సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి గారికి పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, 24.06.2025 వ తేది తెల్లవారుజామున ఓబిలి స్కూలు ఆవరణలో దొంగతనం కాబడిన వినాయక విగ్రహం కేసులో రాబడిన ఖచ్చితమైన మరియు నమ్మకమైన సమాచారం మేరకు, పెనగలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి మరియు సిబ్బంది సుబ్బరాయుడు, రవిశంకర్, రాముడు, నాగయ్య, గోపాల క్రిష్ణ, సుజిత, నాగేశ్వరమ్మ, నాగరాజులు, అన్నమయ్య జిల్లా, పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు (శనివారం) ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని విచారించగా వారు గత నెలలో ఓబిలి స్కూలు ఆవరణలో వినాయక విగ్రహ దొంగతనం గురించి తెలుపడం జరిగినది.
వివరాలోకి వెళితే..
చుక్కా రవి, మదనగోపాలపురం, నందలూరు మండలం అను వ్యక్తి గుప్త నిధుల కోసం చిట్వేలి కి చెందిన కొంత మంది కనిశెట్టి వెంకటసుబ్బయ్య, చిట్వేలి సుబ్బరాయుడు, ఆర్కాటు భాస్కర్ మరియు ఈటిమార్పురం నకు చెందిన డొంకా చంద్ర, బైర్రాజు సుధాకర్ రాజు లతో మాట్లాడుకొని గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో చుక్క రవి వియ్యంకుడు అయిన మనుబోలు కు చెందిన సురేష్ ద్వారా నెల్లూరు లో రాపూరు లక్ష్మమ్మ @ రాపూరు లక్ష్మి, మునుసామి వేలురెడ్డి @పూజారి, గోకిల రమేష్ @ కోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి మరియు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం వారిని మాట్లాడుకొని, అదేవిధంగా గుప్త నిధులు పైన ఆసక్తి ఉన్న పెనగలూరు కు చెందిన దాసరి వెంకట నరసమ్మ మరియు సుధాకర్ రాజు, చంద్ర వారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సుకదేబ్ రైతో, కలక్వాడ్ శ్యాం లతో పాటుగా అందరూ కలిసి గత నెల 23 తేది రాత్రి అందరూ ముటా గా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరి వేకువ జామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఒదేటివారిపల్లి గ్రామానికి వెళ్ళు దారిలో ఒక ట్రాక్టర్ లో ఎక్కించుకొని, అక్కడ నుండి ఈటిమార్పురం చెరువు దగ్గరకు వెళ్లి, అక్కడ విగ్రహాన్ని దింపి, గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెట తో విరగకొట్టగా, సదరు వినాయక విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో సదరు విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంట లో పడవేశారు.
దర్యాప్తులో భాగంగా శనివారం ముద్దాయిలను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వాహనాలు ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిల్ లు, ఒక సమ్మెట లను, వస్తువులను సీజ్ చేయడం అయినదని. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను గుర్తించడం అయినది. పై కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ .వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అభినందించారు.