అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
81,10,000/- రూపాయల విలువ గల 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి
వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం, రాయవరం గ్రామం, కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని, అన్నమయ్య జిల్లా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్,. కి పక్కా సమాచారం రాగా, వారి ఆదేశాల మేరకు, రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో, రాయచోటి రూరల్ సీఐ ఎన్.వరప్రసాద్, టి.సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది మరియు టి.సుండుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కావలిపల్లె అటవీ ప్రాంతంలో కాపుకాసి, అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఆండీ గోవిందన్ ను 05-07-2025 తేది శనివారం ఉదయం 6 గంటలకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు, రాయచోటి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి తెలిపారు.
ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అరెస్ట్ చేసిన ఆండీ గోవిందన్, విచారణలో భాగంగా వెల్లడించిన వివరాలమేరకు తమిళనాడు రాష్ట్రంలోని మరి కొందరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు తప్పించుకుపోయినట్లు తెలిసిందన్నారు. వారిపై గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అటవీ సంపదను, ముఖ్యంగా ఎర్రచందనాన్ని రక్షించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అదనపు ఎస్పీ ఉద్ఘాటించారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన కోరారు.
ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అదనపు ఎస్పీ ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం నిఘా ఉంచి, స్మగ్లర్ల కదలికలను పసిగడుతున్నారని తెలిపారు.
అటవీ సంపదను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని, భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అరెస్టు ఎర్రచందనం స్మగ్లర్లకు ఒక గట్టి హెచ్చరిక అని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించడానికి దోహదపడుతుందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.
ముద్దాయి:
ఆండీ గోవిందన్, వయస్సు, 43 సం,, సారా మందయ్ గ్రామం, జమునా మత్తుర్ తాలూకా
తిరువన్నామలై జిల్లా, తమిళనాడు.
ముద్దాయి నేర చరిత్ర
ఇతని పై ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి.
1. Cr. No. 22/2017 ఖాజీపేట పీఎస్,
2. Cr. No. 15/2017 దువ్వూరు పీఎస్,
3. Cr. No. 27/2017 మైదుకూరు పీఎస్.
4. Cr. No92/2024 టి. సుండుపల్లి.
స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు :
26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
కీప్యాడ్ సెల్ ఫోన్
ప్రశంసలు:
అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేయడం లో కీలక పాత్ర పోషించిన రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్.కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ ఎన్ .వరప్రసాద్, సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, మరియు టి. సుండుపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. మీడియా సమావేశంలో రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ హెగ్డే ఐపిఎస్ పాల్గొన్నారు.