నిరుద్యోగ యువతకు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
నిరుద్యోగ యువతకు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
•ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వెల్లువ
• మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కృషితో ఏవియేషన్ రంగంలో కీలక పెట్టుబడులు
• రాష్ట్రానికి సుస్థిరమైన, నమ్మకమైన పెట్టుబడులు రాక
• రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావారణం
• ఏవియేషన్ రంగంలో దేశంలో అగ్రగామి సంస్థలు రాష్ట్రంల పెట్టుబడులకు ఆసక్తి
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక, వ్యూహాత్మక పెట్టుబడులకు గమ్యస్థానంగా అవతరించబోతుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, దీంతో గతేడాది కాలంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ప్రవాహాం పెరిగిందన్నారు.. నేడు సచివాలయంలో ఆర్ & బీ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.. ముఖ్యంగా నేడు దేశంలో ఏవియేషన్ రంగంలో అగ్రగామి సంస్థలుగా ఉన్న ప్రముఖమైన 3 సంస్థల & ప్రముఖ డేటా సెంటర్ ప్రతినిధులు మంత్రిని కలిసి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు...
*సరళ ఏవియేషన్ సంస్థ తయారీ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*
దేశంలోనే అగ్రశ్రేణి EVTOL (Electric Vertical Take-Off and Landing) విమాన తయారీ సంస్థలలో ఒకటైన సరళ ఏవియేషన్ (Sarla Aviation) సంస్థ ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సరళ ఏవియేషన్ సంస్థ సంసిద్ధం వ్యక్తం చేసింది..ఈ సందర్భంగా Sarla Aviation సంస్థ యొక్క లక్ష్యాలు, ఆలోచనలు, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన సమగ్ర ప్రెజెంటేషన్‌ను మంత్రికి అందజేయడం జరిగింది.. రాష్ట్రంలో ఈవీటోల్ (EVTOL) తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తమ కార్యాచరణ ప్రణాళికను, సంస్థ యొక్క ఆసక్తిని మంత్రితో పంచుకోవడం జరిగింది.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, రాష్ట్రంలో సరళ ఏవియేషన్ సంస్థ తయారీ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని ఆ సంస్థ ప్రతినిథులకు తెలిపిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*
పైలెట్ శిక్షణ ఇచ్చే గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ ఏపీలో తమ సంస్థ ఏర్పాటుకు ఆసక్తి
ఏవియేషన్ రంగంలో విద్యార్ధులకు పైలెట్ శిక్షణ ఇచ్చే గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ సంస్థ ప్రతినిధులు సైతం నేడు మంత్రిని తన ఛాంబర్ కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.. ఎయిర్ లైన్ పైలెట్స్ కావాలనుకునే ఔత్సాహిక యువత, విద్యార్ధులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంలో గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ విశేషమైన అనుభవం కలిగి ఉంది..
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వైమానిక & నాటికల్ పరికరాల తయారీ సంస్థ హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి
రాడార్, GPS పరికరాలు, శోధన, గుర్తింపు & నావిగేషన్ వ్యవస్థలతో సహా వివిధ వైమానిక మరియు నాటికల్ పరికరాల తయారీ సంస్థ హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సైతం మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా మంత్రి ఛాంబర్ లో కలిసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని తెలియజేయడం జరిగింది.. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో, నీటి నాణ్యతా ప్రమాణాల, పోర్టుల భద్రతపై నిరంతర నిఘా వంటి అంశాల్లో ఈ సంస్థ సేవలు అందించనుంది..
ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న ఏవియేషన్ రంగంలో 4 అగ్రగామి సంస్థలు
ఏవియేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఇటువంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం నిజంగానే శుభపరిణామం... ఇప్పటికే ఈప్లెన్ కంపెనీ (EPlane Company), బ్లూజే ఏవియేషన్ (BLUJ Aviation), మరియు మాగ్నమ్ వింగ్స్ (Magnum Wings) వంటి ప్రముఖ EVTOL సంస్థలు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చడమే కాదు, మంత్రిని స్వయంగా కలిసి వారి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు తెలియజేయడం జరిగింది.. ఈ క్రమంలో నేడు తాజాగా రాష్ట్రంలో సరళ ఏవియేషన్ (Sarla Aviation), గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ, హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ అంశం....
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఎలక్ట్రిక్ విమాన తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోంది... శాశ్వత పెట్టుబడులు, సుస్థిరమైన ఉపాధి అవకాశాలు, మరియు టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.. EVTOL రంగంలో ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం కల్పించడంలో ఈ ప్రణాళికలు భవిష్యత్తులో ఎంతోగానో ఉపయోగపడనున్నాయి..
ఏపీలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చిన ప్రముఖ డేటా సెంటర్ CtrlS ..
దేశంలో ప్రముఖ డేటా సెంటర్లలో ఒకటైన CtrlS డేటా సెంటర్ సంస్థ ప్రతినిథులు.. నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చడం జరిగింది.... ఆంధప్రదేశ్ లో దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి CtrlS డేటా సెంటర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తే, అన్ని విధాలుగా సహకరిస్తామని వారికి మంత్రి భరోసా ఇవ్వడం జరిగింది..
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడులు క్యూ కడతాయి
రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో సుస్థిరమైన, నమ్మకమైన సంస్థలు, పరిశ్రమలు, భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి క్యూ కడతాయని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి విశ్వాసం.. అందు కోసం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఇప్పటికే రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలతో అనునిత్యం ప్రత్యేకంగా చర్చలు జరపడం జరుగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పూర్తిగా దిగజార్చిన క్రమంలో.. నేడు పెట్టుబడిదారుల్లో సడలిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉంది.. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ ను ఉపయోగించుకుంటూ.. పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ప్రతి రోజూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంతో పాటు, ఇన్వెస్టర్ లకు తిరిగి రాష్ట్రంపై నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వచ్చే ప్రతీ రూపాయి ద్వారా.. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో అగ్రతాంబూలం వేసే విధంగా ఒక నిర్ధిష్ట కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.. అదే సమయంలో భవిష్యత్తు తరాల భవితకు ఉపయోగపడేలా సుస్థిరమైన, నమ్మకమైన పెట్టుబడులు పెట్టే సంస్థలకు మెరుగైన రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు..
నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేసిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తున్నారు.... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తొందని ఈ సందర్భంగా మంత్రి పెట్టుబడుదారులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న ఔత్సాహిక పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.. రాష్ట్రంలో పెట్టుబడుదారులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలతో పాటు, ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగ కల్పనలు కల్పించే సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు.