రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పని చేసే ప్రభుత్వానికి, పని చేయని ప్రభుత్వానికి తేడా గమనించాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పని చేసే ప్రభుత్వానికి, పని చేయని ప్రభుత్వానికి తేడా గమనించాలి.

• అప్పుల ఉభిలో కూరుకు పోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారు.

• కృష్ణా- గోదావరి జలాల పవిత్ర సంఘమం దగ్గర జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల.


వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఐసీయూ లోకి తీసుకొచ్చి కోలుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ మెరుగైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా పోలవరం కూడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి వచ్చిన గోదావరి జలాలకు ఇబ్రహీం పట్నం పవిత్ర సంఘమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

గోదావరి నదిలో ప్రతి సంవత్సరం 3 వేల టీఎంసీ లు నీరు వృథాగా సముద్రంలోకి కలసిపోతుంది.

ఆ వరద నీటిని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలోగా ఆ ఫలాలు కొంతమేర అయినా అందించాలనే ఆలోచనలో భాగంగానే నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అని గుర్తు చేశారు. ఐతే అప్పుడు 2014-19 లో ప్రతిపక్షం లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో పట్టిసీమ కాదు, ఇది ఒట్టి సీమ అని ఏద్దేవా చేశారు అని అన్నారు. అలాంటి పట్టిసీమే కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఉపయోగపడింది అని పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా, కృష్ణా నది ఎగువన శ్రీశైలం బ్యాక్ వాటర్ ను రాయలసీమ కు ఉపయోగించుకోవడం జరుగుతోందని తెలిపారు.

గతేడాది రాయలసీమ లో ఏ రిజర్వాయర్ లో చూసినా 90 నుండి 95 శాతం నీటి సామర్థ్యం తో నీటిని నిల్వ చేయగలిగాం అని ఇది చంద్రబాబు గారి ముందు చూపు,వాటర్ మానజ్మెంట్ ద్వారానే సాధ్యమైందన్నారు. పట్టిసీమ ద్వారా 2014 -19 లో 263 టీఎంసీ ల గోదావరి జలాలు కృష్ణా నదిలోకి ఎత్తిపోశాము. ఇది శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయు నీటి మట్టం కంటే కూడా ఎక్కువ. అదేవిధంగా ఇప్పటివరకు 428 టీఎంసీ ల నీటిని తరలించాం. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అని వివరించారు.

పట్టిసీమ వల్ల నాడు టీడీపీ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో కృష్ణా డెల్టాకు గోదారి జలాలు తరలించడం ద్వారా 50 వేలకోట్ల ఆదాయం సాధించడం జరిగింది. ఇలా కేవలం 1300 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే 50 వేల కోట్ల సంపదను రాష్ట్రప్రభుత్వానికి అందించిందని స్పష్టం చేశారు. ఇలా పట్టిసీమ కృష్ణా డెల్టాకు వరప్రదాయని అన్నారు. తద్వారా రాయలసీమను సైతం కరువు కాటకాల ద్వారా కాపాడింది అని తెలిపారు.

పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత టీడీపీ పాలనలో రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలు ఉంటే, వీటి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తే, గత పాలనలో 450 లిఫ్ట్ స్కీం లు మూతపడ్డాయని,ఈ లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరందని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మరలా నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడిన లిఫ్ట్ స్కీమ్స్ అన్నిటినీ బాగు చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుని , మూతపడిన ప్రతి లిఫ్ట్ స్కీమ్ ను రిపేర్ చేసుకోవడానికి టెండర్లు పిలచి , ఓ అండ్ ఎం కోసం కూడా టెండర్లు పిలచి రైతులకు భారం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు.

వరద ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు గారిది. ఒక ఏడాది వర్షం పడి వరదలు వచ్చినా, మరో ఏడాది వర్షాలు పడక పోయినా నిల్వ చేసుకున్న నీటిని వినియోగించుకోవాలని సూచించారన్నారు. ఈ వాటర్ మానజ్మెంట్ లో భాగంగానే పులిచింతల ప్రాజెక్ట్ లో నేటికి కూడా ఇంకా 20 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది, గత ఏడాది కృష్ణా నదికి వచ్చిన వరద జలాలను 45 టీఎంసీ ల నీటిని నిల్వ చేసుకుని తద్వారా ఈ వేసవి సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించుకున్నాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పులిచింతల ప్రాజెక్ట్ లో కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని మంత్రి నిమ్మల అన్నారు. 

ఇక్కడే గత వైసీపీ ప్రభుత్వ పాలనా విధానానికి , కూటమి ప్రభుత్వం పాలనా విధానానికి తేడా తెలుస్తోందని అన్నారు.

గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ లిఫ్ట్ స్కీమ్స్ కి గానీ, లాకులకు, షట్టర్లకు, డోర్లకు గానీ , రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టలేదు. ఇలా పులిచింతల గేటు కొట్టుకుపోయినా, గుండ్ల కమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 20 గ్రామాలు నీట మునిగిపోయి, 42 మంది చనిపోయునా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం లో వీటన్నిటినీ ప్రక్షాళన చేస్తున్నాం అని, గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పిదాలు, పాపాలు అన్నీకూడా శాపాలుగా వెంటాడుతున్నాయు అని వివరించారు.

ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా గేట్ల మరమ్మతులకు నిర్వహణ పనులకు మొదటి సంవత్సరమే 700 కోట్లు ఖర్చు చేశాం. ఐతే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఓ అండ్ ఏం పనులకు కనీసం 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అని విమర్శించారు. శ్రీశైలం ప్లంజ్ పుల్ దెబ్బతింటే 14 కోట్లు కేటాయుంచి నష్ట నివారణ కు అంచనాలు రూపొందిస్తున్నాం అని, అదేవిధంగా ఏప్రన్, ఇతర రిపేర్లకు, ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు 350 కోట్లు మంజూరు చేసాం అని స్పష్టం చేశారు.

గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా జూలై లో మొదటి వారంలోనే శ్రీశైలం కు వరద పరవళ్లు తొక్కుతోంది. చంద్రబాబు గారు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అని తెలిపారు.

ప్రతి ఎకరాకు నీరందించాలి అని చంద్రబాబు ఆశయం అని 2014 రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అని అన్నారు.

అప్పుల ఉబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తోడుగా, మోదీ అండ తో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలోపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని, వెంటిలేటర్ మీద ఉన్న ఆర్ధిక పరిస్థితిని ఐసియు లోకి తీసుకు వచ్చాం అని అన్నారు. ఐసియు నుండి మరింత చికిత్స చేసి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ , ఆర్ అండ్ బి , పంచాయతీ రాజ్ శాఖ, ఇలా అన్ని శాకలను, పోలవరం , అమరావతి నిర్మాణాలను చేస్తూ, ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తూ, మెరుగైన పాలన అందిస్తున్నాం అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి నిండి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్లీ రపా రపా నరుకుతాం అంటూ రోడ్లమీదకు వస్తున్నారు. ఇలాంటివాళ్లు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హులా అని ప్రజలు ఆలోచన చేయాలి అని అన్నారు.

Comments

-Advertisement-