తెలంగాణలో 'ఎస్ఐఆర్' సర్వే!
తెలంగాణలో 'ఎస్ఐఆర్' సర్వే!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఓటరు జాబితాను సరిచేయడానికి, అనర్హులను తొలగించడానికి మరియు కొత్త ఓటర్లను నమోదు చేయడానికి ఇది ఉద్దేశించిన కార్యక్రమం.
ముఖ్య అంశాలు:
ప్రతి 20-25 సంవత్సరాలకు ఒకసారి SIR సర్వే నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా చివరిసారిగా 2002లో జరిగింది. ఇటీవల బీహార్ లో ఈ సర్వే చేపట్టారు.
ఎన్నికల సంఘం (ECI) నుండి చీఫ్ ఎలక్టోరల్ అధికారు (CEO) లకు రాష్ట్రాల్లో సర్వేకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. అధికారిక షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు.
ఎస్ఐర్ లో భాగంగా ఎన్నికల సిబ్బంది ప్రతి ఓటరు వద్దకు వెళ్లి సర్వే చేపడతారు. బీహార్ లో నిర్వహించిన సర్వేలో దాదాపు 41 లక్షల మంది ఓటర్ల ఆచూకీ లభించలేదు. వారిలో ప్రధానంగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, మృతిచెందినవారు, రెండుచోట్ల ఓటర్లుగా నమోదైనవారు ఉన్నారు.
తెలంగాణ ఓటర్ల సంఖ్య (జనవరి 2025 నాటికి):
మొత్తం ఓటర్లు: 3,35,27,925
పురుషులు: 1,66,41,489
స్త్రీలు: 1,68,67,735
ఇతరులు: 2,829
సర్వీస్ ఓటర్లు: 15,872
రాష్ట్ర అధికారులకు శిక్షణ: దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి ECI ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తెలంగాణకు చెందిన 119 మంది ఈఆర్వోలు, 799 మంది అసిస్టెంట్ ఈఆర్వోలు, 476 మంది అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు (ఏసీఎంటీలు) తో పాటు బీఎల్ వోలు, బీఎల్ ఏలకు శిక్షణ పొందారు.
ఓటరు నమోదుకు గుర్తింపు పత్రాలు (ఆధార్ మినహా 11 ప్రామాణికం): ఎస్ఐర్ సర్వేలో ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోరు. ఓటరు నమోదుకు ఆధారంగా ఈ క్రింది 11 గుర్తింపు కార్డుల్లో ఏదో
ఒకటి చూపాలి:
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పీఎస్ యూ ఉద్యోగుల గుర్తింపు కార్డు
2. 01-07-1987 కంటే ముందు దేశంలో ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ఎస్ఐసి జారీచేసిన ఆధారాలు
3. సాధికార సంస్థ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం
4. పాస్ పోర్ట్
5. గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం జారీచేసిన విద్య ధ్రువీకరణ పత్రం
6. అధికారిక స్థిర నివాస ధ్రువీకరణ పత్రం
7. అటవీ హక్కుల పత్రం
8. కుల ధ్రువీకరణ పత్రం
9. జాతీయ గుర్తింపు కార్డు
10. స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం
11. ప్రభుత్వం ద్వారా జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం