Health Benefits: ప్రతి రోజూ ఒక కప్పు సోయాబీన్‌ను ఉడకబెట్టి తినండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి..!
Health Benefits: ప్రతి రోజూ ఒక కప్పు సోయాబీన్‌ను ఉడకబెట్టి తినండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి..!
ఆరోగ్యకరమైన ఆహారాలు తినేందుకు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సాయంత్రం అయిందంటే చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలు తినేందుకు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సాయంత్రం అయిందంటే చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది. దీంతో పోషకాలు, శక్తి లభించడంతోపాటు రోగాలను తగ్గించుకోవచ్చు. ఇక అలాంటి ఆరోగ్యవంతమైన ఆహారాల్లో సోయాబీన్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా వీటిని చాలా మంది తినరు. కానీ అవి అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. సోయాబీన్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. వీటిని రోజంతా నీటిలో నానబెట్టి సాయంత్రం ఉడికించి కాస్త పోపు వేసి గుడాల (గుగ్గిళ్ల) మాదిరిగా చేసుకుని తినవచ్చు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పోషకాలు అధికం:
సోయాబీన్స్‌ను 100 గ్రాముల మోతాదులో ఉడకబెట్టి తింటే సుమారుగా 170 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 18 గ్రాములు, కొవ్వులు 9 గ్రాములు, పిండి పదార్థాలు 6 గ్రాములు, ఫైబర్ 6 గ్రాములు లభిస్తాయి. అలాగే విటమిన్లు కె, బి9, బి1, బి2, బి3, బి5, బి6, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నిషియం, జింక్, పొటాషియం, సెలీనియం, క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు సోయాబీన్ ను రోజూ తింటే ఎంతగానో ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి. సోయాబీన్స్‌లో వృక్ష సంబంధమైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్‌వెజ్ తినని వారు ప్రోటీన్ల కోసం వీటిని తినవచ్చు. దీంతో కండరాలకు శక్తి లభిస్తుంది. కండరాలు నిర్మాణమవుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యానికి:
సోయాబీన్‌లో ఉండే ప్రోటీన్ల కారణంగా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. రక్త నాళాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి సోయాబీన్ ఎంతగానో మేలు చేస్తుంది. సోయాబీన్ గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక సోయాబీన్‌ను తింటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. వీటితో షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఎముకల దృఢత్వానికి:
సోయాబీన్‌లో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఎముకలు పెళుసుగా మారి సులభంగా విరగకుండా దృఢంగా ఉంటాయి. ఎముకలు గుల్లబారిపోవడం తగ్గుతుంది. 45 ఏళ్లు దాటిన మహిళలు మెనోపాజ్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కానీ సోయాబీన్‌ను తింటే వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి సైతం బయట పడవచ్చు.
అధిక బరువు తగ్గేందుకు:
సోయాబీన్‌ను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజువారి ఆహారంలో సోయాబీన్‌ను చేర్చుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సోయాబీన్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా సోయాబీన్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.