విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
- అశోక్ నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
- ఇంటింటికీ తిరిగి ఏడాదిలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించిన మంత్రి టి.జి భరత్
సీఎం చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలోనే రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 45వ వార్డు అశోక్ నగర్ లో ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఏ ఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు.
అనంతరం మంత్రి టి.జి భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చాలామంది పింఛన్లు కట్ చేశారని ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనుల వల్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీ నాయకులమందరం భాగస్వాములై ఇంటింటికి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకొని వెంటనే వీటి పరిష్కారం కోసం తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాణిక్యమ్మ, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.