రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వచ్చే నెలలో తిరుపతిలో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహణ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వచ్చే నెలలో తిరుపతిలో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహణ

  • రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
  • కాకినాలో కన్నుల పండువగా నిర్వహించిన కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుక, ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
  • ఈమా లైమ్ లైట్ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానం
  • పిపిపి విధానంలో చేపడుతున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగం కావాలని సూచన
  • సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
  • ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
  • త్వరలోనే రాష్ట్రస్థాయిలో ఈవెంట్ మేనేజ్ మెంట్ సమావేశం నిర్వహణ.. తద్వారా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ల సలహాలు, సూచనలు స్వీకరణ


విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్య కార్యరూపంలోకి వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం కాకినాడ విద్యుత్ నగర్ లోని ఏ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో, ఈమా లైమ్ లైట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా తన చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేశారు. ఈవెంట్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి, సత్కరించడానికి ఉద్దేశించిన ఈమా లైమ్ లైట్ అవార్డులను అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఈవెంట్ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించడం, ప్రశంసించడం గొప్ప విషయమని కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ను అభినందించారు.   

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రకృతి సౌందర్యంతో పాటు ఎక్కువ సంఖ్యలో హోటల్స్, రిసార్ట్స్, గదులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ల ఏర్పాటు అవసరాన్ని వివరించారు. పిపిపి విధానంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధిలో భాగంగా సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా అసోసియేషన్లకు సూచించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ4 విధానంలో భాగస్వామ్యులు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్రస్థాయిలో ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ సమావేశం నిర్వహించి తద్వారా పలు ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ల సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో పెరుగుతున్న పర్యాటక ఆసక్తిని, ఇంట్లో జరిగే శుభకార్యాలు మొదలుకొని సినిమా ఫంక్షన్ల వరకు చేస్తున్న ఈవెంట్లను, ఈవెంట్ మేనేజ్ మెంట్ కు పెరిగిన ఆదరణ, ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులను చేసేందుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 

మారుతున్నప్రపంచంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కి ప్రాముఖ్యత సంతరించుకుందని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో ఎవరికి వాళ్లే కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి నుండి నేడు ఇంట్లో జరిగే కార్యక్రమాలు మొదలుకొని సినిమా ఫంక్షన్ల వరకు ఈవెంట్ మేనేజ్ మెంట్ ల పైనే ఆధారపడ్డ పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో మంచి ఈవెంట్ లు చేయాలని అసోసియేషన్ కు, కార్యవర్గ సభ్యులకు శుభాశీస్సులు అందించారు. అదే విధంగా పూర్తి స్థాయిలో అవకాశాలు రాక, స్థానిక ప్రతిభను వినియోగించుకోకపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండే ఈవెంట్ మేనేజర్ లపై ఆధారపడే పరిస్థితి ఉందని కొన్ని ఉదాహరణలు తెలిపారు. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ప్రతిభ గల మానవవనరులను ప్రోత్సాహించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈవెంట్ ను నిర్వహించే సామర్థ్యం స్థానికంగా ఉన్న యువతలో మెండుగా ఉందన్నారు. దానిని వినియోగించుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలో టూరిజంకు ఆదరణ పెరుగుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు. భవిష్యత్ లో ఏ ఇజం ఉండదు కేవలం టూరిజం మాత్రమే ఉంటుదన్న సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. గతంలో పర్యాటక రంగానికి ఇంత ప్రాధాన్యత లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అటు శ్రీకాకుళం నుండి ఇటు అనంతపురం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం, విజయవాడలలో టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించామన్నారు. త్వరలోనే తిరుపతిలో ఇన్వెస్టర్ కాన్ క్లేవ్ నిర్వహిస్తామన్నారు. పీపీపీ విధానంలో పర్యాటక అభివృద్ధి చేపట్టేందుకు ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. టూరిజం ప్యాకేజీల ఏర్పాటు, పర్యాటకుల కోసం యాక్టివిటీస్ తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్ తదితర విభిన్న టూరిజం ప్రక్రియలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ ల అవసరం ఉంటుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేందుకు తాము చర్యలు చేపట్టామని అందులో భాగంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ లను వినియోగించుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న అంశంపై ఈవెంట్ మేనేజ్ మెంట్ లు దృష్టిపెట్టాలన్నారు. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ,రాజమహేంద్రవరం, అమలాపురంల నుండి ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ లలో పాల్గొనే కళాకారులకు సరైన అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ లను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకొని ఎలాంటి అవకాశాలు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వపరంగా దృష్టిసారిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ లో అద్భుతమైన ప్రతిభకలిగిన వ్యక్తి, జనసేన క్రియాశీల కార్యకర్త చింతపల్లి బన్ని అని ఆయన్ను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. 

కార్యక్రమంలో సినిమా రంగానికి సంబంధించిన నటీనటులు, కళాకారులు, కాకినాడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ నిర్వాహకులు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-