త్వరలో నిరుద్యోగ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
త్వరలో నిరుద్యోగ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
అమరావతి, జూలై 20
డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాల ద్వారా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ఆది వారం నాడు విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి కేంద్రాలుగా బ్యాంక్ PO, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ (RRB) పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ ఎస్సి,ఎస్టీ యువత వినియోగించుకోవాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సూచించారు.