రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏపీ స్థానికత ఉన్న హోం గార్డులను రాష్ట్రానికి రప్పించండి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏపీ స్థానికత ఉన్న హోం గార్డులను రాష్ట్రానికి రప్పించండి

  • హోంగార్డులు, విదేశీ వైద్యవిద్యా గ్రాడ్యుయేట్ల సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు
  • సీఎం చంద్రబాబుకు వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


అమరావతి, జూలై8: హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేర్వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పట్టభద్రులు ఎదుర్కోంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్యవిద్యలో విదేశాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఏపీకి చెందిన విద్యార్ధులకు ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరిస్తోందని ఈ నిబంధనను సవరించేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించారు. వైద్య నిపుణుల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో ఏపీఎంసీ నిబంధనల్ని మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిబంధనల్ని సవరించారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపు, పోలీసు సెలక్షన్లలో రాయితీలు కల్పించే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ఏపీ తెలంగాణా రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 400 మంది ఏపీ స్థానికత కలిగిన హోం గార్డులు తెలంగాణాలో పనిచేస్తున్నారని వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామకృష్ణ సీఎం ను కోరారు. వేతనం పెంపుతో పాటు పోలీసు సెలక్షన్లలో నిబంధనలను సడలించి హోంగార్డులకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-