ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ....
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ....
- ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.....
- సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలి..... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ
- కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహణ....
- జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం నిర్వహించి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS హెలిపాడ్, నీటి పంపింగ్ స్టేషన్ (జలహారతి నిర్వహించి ప్రదేశం ), సభాస్థలి మొదలగు ప్రాంతాలలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం జిల్లా ఎస్పీ బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి గారు హెలిపాడ్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అడిషనల్ ఎస్పీలు 2, డీఎస్పీలు 7, ఇన్స్పెక్టర్లు 37, సబ్ ఇన్స్పెక్టర్లు 52,ASI/HC లు 177, కానిస్టేబుళ్ళు 308,WPC (మహిళా పోలీసులు) లు 49, హోంగార్డ్స్ 84 మందితోపాటు AR fores (సాయుధ బలగాలు )105 మంది, బాంబు స్కాడ్ , డాగ్ స్కాడ్ బృందాలు మరియు 06 స్పెషల్ పార్టీ బృందాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా నిర్వహించాలి.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.
అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చేవరకు మీకు కేటాయించిన డ్యూటీ ప్రదేశం విడిచి వెళ్లరాదు.
విధులలో నిర్లక్ష్యం వహించరాదని
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ASP మంద జావళి ఆల్ఫోన్స్,SSG అధికారులు రమణ, శాంతారావు గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు, RIO రాఘవేంద్ర, డీఎస్పీలు ప్రమోద్ మరియు రామంజి నాయక్ పాల్గొన్నారు.