రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పిఠాపురం నియోజక వర్గంపై పవన్ కళ్యాణ్ మార్క్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 పిఠాపురం నియోజక వర్గంపై  పవన్ కళ్యాణ్  మార్క్

• అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందడుగు 

• ఏడాదిలో వెయ్యి కోట్ల అభివృద్ధి.. ఇది ఉపముఖ్యమంత్రి గారి సత్తా..

•  పవన్ కళ్యాణ్  నిజ జీవితంలోనూ హీరోనే

•  పవన్ కళ్యాణ్  చేసిన అభివృద్ధి రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామాన కనబడుతుంది

• అభివృద్ధికి అర్ధం తెలియని వారు  పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారు

• ప్రజలతో ఛీ కొట్టించుకున్న నాయకులు విలువలేని విమర్శలు చేస్తున్నారు

• వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు

• కూటమి పాలనలో వైసీపీ ఆటలు సాగవు

• పిఠాపురంలో మీడియా సమావేశంలో జనసేన నాయకులు


ఏడాది కాలంలో ఒక నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అభివృద్ధి సాధించిన ఏకైక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  మాత్రమేనని, శాసన సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా ఆయన ముందుకు సాగుతున్నారని కాకినాడ రూరల్ శాసన సభ్యులు  పంతం నానాజీ స్పష్టం చేశారు. పిఠాపురం ఆనుకుని ఉన్న మా నియోజకవర్గాలన్నీ అదృష్టం చేసుకున్నాయని మేము భావిస్తుంటే.. అభివృద్ధికి అర్ధం తెలియని కొంత మంది పిఠాపురం వచ్చి ఆయనపై విమర్శలు చేసి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. తమ తమ ప్రాంతాల్లో జనంతో ఛీ కొట్టించుకున్న నాయకులు చేసే విమర్శలకు ఏ పాటి విలువ ఉంటుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మంగళవారం పిఠాపురంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో  పవన్ కళ్యాణ్  చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడిస్తూ వైసీపీ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. 

ఈ సందర్భంగా  పంతం నానాజీ మాట్లాడుతూ... " పవన్ కళ్యాణ్  దేశవ్యాప్తంగా ఖ్యాతి కలిగిన నాయకుడు. దేశం మొత్తం  పవన్ కళ్యాణ్  నామస్మరణతో మారుమోగుతోంది. జాతీయ స్థాయిలో ఆయనకి అప్పగించిన బాధ్యతలు చాలా పెద్దవి. తనకు అప్పగించిన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తూనే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏడాది కాలంలో వందల కోట్ల అభివృద్ధి చేశారు. తాజాగా బీచ్ కారిడార్ కోసం రూ. 325 కోట్లు కేంద్రం నుంచి తెచ్చారు. ఏడాదిలో సుమారు రూ. 1000 కోట్ల అభివృద్ధి సాధించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండడంతో మా అందరికీ అదృష్టం పట్టింది. అలాంటి నాయకుడి గురించి జనంలో చలామణి అవని కొంత మంది నాయకులు వచ్చి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్లిపోయారు.  పవన్ కళ్యాణ్  పిఠాపురం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చిట్టా మీరు చదవలేనంత ఉంది. పవన్ కళ్యాణ  చేసిన అభివృద్ధి కాగితాల్లో వైసీపీ ప్రభుత్వం మాదిరి కాగితాల్లో కనబడదు. క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే కనబడుతుంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అభివృద్ధి మాత్రమే కనబడుతోంది. వేధింపులు, ప్రత్యర్ధులను తిట్టడం వంటి కార్యక్రమాలకు దూరంగా ముందుకు వెళ్తున్నాం. వైసీపీ హయాంలో అభివృద్ధి అనే పదమే వినబడలేదు. ఆ పార్టీ నాయకులంతా దోచుకోవడానికి మాత్రమే దారులు వెతుక్కున్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త మాకు అప్పగించి వెళ్లారు. ఏడాదిలో వారు వదిలివెళ్లిన చెత్త ఎత్తుకుంటూ, రూ. 10 లక్షల కోట్లకు వడ్డీ కట్టుకుంటూ సుపరిపాలన అందించిన ప్రభుత్వం మాది. పవన్ కళ్యాణ్  జగన్మోహర్ రెడ్డి మాదిరి పరదాల చాటున దాక్కునే నాయకుడు కాదు. శవ రాజకీయాలు చేయలేదు. వారసత్వ రాజకీయాలను నమ్ముకోలేదు. కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికల మీద ముందుకు వెళ్తున్నారు.

సీటు కోసం ఆయన కాళ్లు పట్టుకునేందుకు సిద్ధపడలేదా?

 పవన్ కళ్యాణ్  సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే. ఈ రోజున ఆయనపై లెఫ్టు లెగ్గు, రైట్ లెగ్గు అని పిచ్చి ప్రేలాపనలు పేలిన జక్కంపూడి రాజా జనసేన సీటు కోసం  పవన్ కళ్యాణ్ గారి కాళ్లు పట్టుకునేందుకు పగలు రాత్రి తేడా లేకుండా వారం రోజులపాటు పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఉత్తరాంధ్ర ప్రజలతో ఛీ కొట్టించుకున్న బొత్స సత్యనారాయణ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులకి అధికారులు పనులు ఎలా మొదలుపెట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చేసిన ఖర్చులకి రికార్డులు లేవు.  పవన్ కళ్యాణ్  బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన చేసిన అభివృద్ధి పిఠాపురంలోనే కాదు రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామాన కనబడుతోంది. పిఠాపురంలో పెద్ద పెద్ద నాయకులు కూడా చేయలేని అభివృద్ధిని ఆయన చేశారు" అన్నారు.

జగన్ స్క్రిప్ట్ ను వైసీపీ కాపు నేతలు చదువుతున్నారు :  తుమ్మల రామస్వామి, డీసీసీబీ ఛైర్మన్

తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్  తుమ్మల రామస్వామి (బాబు( మాట్లాడుతూ.. "వైసీపీ నాయకుడు జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ను ఆ పార్టీ కాపు నాయకులు జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజాలు చదువుతూ ఆనంద పడుతున్నారు.  పవన్ కళ్యాణ్  అనే ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి వచ్చి మీ మీదే పడుతుందని వైసీపీ నాయకులు అర్ధం చేసుకోవాలి. పిఠాపురంలో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతోంది. ఏడాది కాలంలో రూ. 300 కోట్లకు పైగా అభివృద్ధ పనులు జరిగాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోంది. దాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వస్తే ప్రత్యక్షంగా చూపుతాం. దాడిశెట్టి రాజాకు గంజాయి గురించి తెలిసినంతగా వైసీపీ నేతలెవరికీ తెలియదు. ఇప్పటికీ గంజాయి అమ్ముతున్నారు అని చెబుతున్నారు. వారెవరో ఆయనకి తెలిసిన వారే అయ్యి ఉంటారు. వారి పేర్లు చెబితే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అప్పుడైనా బుద్ది వస్తుంది. ఎలాంటి లాభాపేక్షా లేకుండా నిజాయితీగా సేవ చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉండి కూడా సొంత నిధులను ప్రజల కోసం ఖర్చు చేస్తున్న నాయకుడిగా జాతీయ స్థాయిలో ఆయనకు పేరు వస్తున్న సమయంలో వైసీపీ నాయకులు ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. ఒక ఎలక్ట్రీషియన్ ప్రమాదవశాత్తు మరణిస్తే, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకూడదని సొంత నిధులతో ఎలక్ట్రీషియన్లకు కిట్లు కొనిచ్చిన గొప్ప ఆలోచన  పవన్ కళ్యాణ్ గారిది. జీతాన్ని మొత్తం అనాథ పిల్లలకు పంచిన గొప్ప నాయకుడు  పవన్ కళ్యాణ్ . జక్కంపూడి రాజా అనే వాడిని పవన్ కళ్యాణ్ నిలబెట్టిన  బత్తుల బలరామకృష్ణ తంతే ఎగిరి ఎక్కడో వెళ్లి పడ్డాడు. ఎన్నికల ముందు టిక్కెట్టు కోసం సాగిలా పడిన వ్యక్తులు కూడా ఇప్పుడు  పవన్ కళ్యాణ్  గురించి మాట్లాడుతుంటే సిగ్గు వేస్తోంది.  పవన్ కళ్యాణ్  నిజాయితీకి మారు పేరు. పిఠాపురాన్ని సరికొత్త రోల్ మోడల్ గా తయారు చేస్తారు" అన్నారు.

సైకో వెంట తిరిగి వైసీపీ నాయకులు సైకోల్లా మారారు :  తోట సుధీర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్  తోట సుధీర్ మాట్లాడుతూ "జగన్ అనే సైకో వెంట ఉంటే వైసీపీ నాయకులు కూడా సైకోల్లాగానే మాట్లాడుతారు. వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజాలు చేయని అక్రమం లేదు. అటవీ భూములను ఆక్రమించి గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికే అమ్మి సొమ్ము చేసుకున్న ఘనత వీరిది. ఇసుకను దోచి కోట్లు దండుకున్నారు. గంజాయి అమ్మి యువతను చిత్తు చేశారు. ఒక వైపు  పవన్ కళ్యాణ్  పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంటే ఓర్చుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సమాజంలో గొడవలు సృష్టించి శాంతి భద్రతలు లేకుండా చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ నాయకులు కలలు కంటున్నారు. కూటమి పాలనలో వాళ్ల ఆటలు సాగవు. మరో 15 సంవత్సరాలపాటు కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది.  పవన్ కళ్యాణ్  పాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయి" అన్నారు.

నిత్యం రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నుతాడు :  వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్  వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ.. "రాష్ట్రం సుస్థిరంగా శాంతి భద్రతలపరంగా పటిష్టంగా ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఎక్కడో ఒక దగ్గర కావాలని అలజడులు సృష్టించాలని కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటాడు. అనంతపురం పర్యటనలో హెలీకాప్టర్ ఘటన, గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో మిర్చి బస్తాల దొంగతనం, సత్తెనపల్లి పర్యటనలో సింగయ్యను కారుతో తొక్కి చంపడం వంటివి చేసి కావాలని ఒక రకమైన అలజడులు సృష్టించేందుకు యత్నిస్తుంటాడు. 2024 ఎన్నికల ముందు కూడా అమలాపురంలో అలజడులు సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డాడు. తన వ్యక్తిగత నైజం ఫ్యాక్షనిజం. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించాలని, రాజకీయంగా వాడుకోవాలని నిత్యం కుట్రలు చేస్తుంటాడు. తన పార్టీలోని కాపు నాయకులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తుంటాడు. అలాగే  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకులతో తిట్టించి ఆనందపడుతుంటాడు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా కోవూరు మహిళా ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడడం సిగ్గు చేటు. ఈ ఘటనను కనీసం జగన్ రెడ్డి ఖండించకపోవడం వైసీపీ అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తోంది.  పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానుసారం మాట్లాడడం ఆపకపోతే ప్రజలే వైసీపీని తిట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయ"న్నారు.

పిఠాపురాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చిన నాయకుడు  పవన్ కళ్యాణ్ గారు :  మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం జనసేన సమన్వయకర్త

పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్  మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్దికి చిరునామాగా మార్చిన ఘనత  పవన్ కళ్యాణ్ గారిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం ఊపిరిపీల్చుకుంటోంది. పిఠాపురం నియోజకవర్గంలో ఏడాది కాలంలో  పవన్ కళ్యాణ్  చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితా చాంతాడులా ఉంటుంది. ఇచ్చిన హామీలే కాదు ప్రజలకు అవసరాలు తెలుసుకుని తీరుస్తున్న నాయకుడు  పవన్ కళ్యాణ్ . ఎన్నికల సమయంలో దూళ్ల సంత గురించి హామీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ రూ. 1.42 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రూ. 36 కోట్లతో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయ్యింది. సూరారంపేట వద్ద బ్రిడ్జి హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలు తెలుసుకుని కట్టిస్తున్నారు. రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతాల్లో 30 కిలోమీటర్లు రోడ్లు వేసి రెండో స్థానంలో నిలిపారు. రూ. 22 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారు. రూ. 11 కోట్లతో బీటీ రోడ్లు వేశారు. రూ. 10 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మించారు. నాణ్యత విషయంలోనూ రాజీ లేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించి ఇప్పటి వరకు 300 రోడ్లు పూర్తి చేయించారు. మరో 40 పూర్తి కాబోతున్నాయి. రూ. 3 కోట్లకు పైగా నిధులతో 30 స్కూళ్లలో కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. పాఠశాలల్లో విద్యార్ధులకు సైన్స్ కిట్లు, స్పోర్ట్స్ కిట్లు అందించారు. నియోజకవర్గంలో 500 గోకులాలు పూర్తయ్యాయి. మరో 500 నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంత అభివృద్ధి మరే నియోజకవర్గంలో జరగలేదు. 

పవన్ కళ్యాణ్  పిఠాపురం ఎన్ని సార్లు వచ్చారు అని అడిగే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు ఎన్ని సార్లు వెళ్లారో చెప్పగలరా?  పవన్ కళ్యాణ్  పదే పదే రాకున్నా ఆయన తరఫున పది విభాగాలు నిరంతరం నియోజకవర్గంలో అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చిన నాలుగు సార్లు వచ్చారు. ప్రజల నుంచి 30 విన్నపాలు స్వీకరించారు. అన్నింటినీ నెరవేర్చారు. నియోజకవర్గంలో ప్రతి వారం గ్రీవెన్స్ నడుస్తోంది. ప్రజల సమస్యలు తీరుస్తోంది. నాడు అడుగడుగునా అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు" అన్నారు. ఈ సమావేశంలో పార్టీ వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్  చల్లా లక్ష్మీ, గోదావరి డెల్టా చైర్మన్  మురాలశెట్టి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Comments

-Advertisement-