రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Kavya Maran: నాపై మీమ్స్‌కు కారణం అదే.. అసలు విషయం చెప్పిన కావ్య మారన్

Kavya Maran Sunrisers Hyderabad IPL Indian Premier League SRH Travis Head Pat Cummins Henrich Klassen Cricket Memes
Mounikadesk

 Kavya Maran: నాపై మీమ్స్‌కు కారణం అదే.. అసలు విషయం చెప్పిన కావ్య మారన్

  • సోషల్ మీడియా మీమ్స్‌పై తొలిసారి స్పందించిన కావ్య మారన్..
  • క్రికెట్‌పై అమితమైన ఇష్టమే మీమ్స్‌కు కారణమని వెల్లడి..
  • మ్యాచ్ ఎక్కడ జరిగినా జట్టును ఉత్సాహపరిచేందుకు వెళ్తానన్న కావ్య
  • ఎంత దూరంలో ఉన్నా కెమెరామెన్ తన హావభావాలనే బంధిస్తారని వ్యాఖ్య..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు, ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు కెమెరాలు ఎక్కువగా ఫోకస్ చేసేది ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్‌పైనే. మ్యాచ్ సమయంలో ఆమె ప్రదర్శించే భావోద్వేగాలు క్షణాల్లో సోషల్ మీడియాలో మీమ్స్‌గా వైరల్ అవుతుంటాయి. అయితే, తనపై వచ్చే ఈ మీమ్స్‌పై కావ్య మారన్ తాజాగా స్పందించారు. క్రికెట్‌పై తనకున్న అమితమైన ఇష్టమే దీనికి కారణమని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... "క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రయత్నిస్తాను. కేవలం హైదరాబాద్‌లోనే కాదు, అహ్మదాబాద్, చెన్నై లాంటి వేరే నగరాల్లో మ్యాచ్‌లు జరిగినప్పుడు కూడా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు వెళ్తాను. నేను స్టాండ్స్‌లో ఎక్కడో దూరంగా కూర్చున్నా, కెమెరామెన్ నా హావభావాలను పదేపదే బంధిస్తుంటారు. బహుశా ఆటపై నాకున్న ఈ మక్కువ వల్లే నేను కెమెరా కంటికి చిక్కుతున్నాను. అవే మీమ్స్‌గా మారుతున్నాయి" అని కావ్య మారన్ వివరించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కావ్య మారన్ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, ఆ జట్టుకు పెద్ద అభిమాని కూడా. మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆమె చూపించే స్పందనలు అభిమానులను ఆకట్టుకుంటాయి. కొన్ని కీలక సందర్భాల్లో ఆమె డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రసంగాలు కూడా ఇస్తుంటారు. ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు.

కాగా, డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో ఒకసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2018, 2024 సీజన్లలో ఫైనల్స్‌కు చేరుకుని రన్నరప్‌తో స‌రిపెట్టుకున్న విష‌యం తెలిసిందే.



Comments

-Advertisement-