కళామతల్లి ముద్దుబిడ్డ "బళ్లారి రాఘవ
కళామతల్లి ముద్దుబిడ్డ "బళ్లారి రాఘవ
జయంతి సభలో ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయన్ శర్మ
అనంతపురం, ఆగస్టు 02:
నాటక పితామహుడు బళ్లారి రాఘవ కళామతల్లి ముద్దుబిడ్డ అని ఆయన జీవితం తెలుగు జాతికి మణిహారమంటూ ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మకొనియాడారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 145వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్డ్ కలెక్టర్ హాజరై బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డిఆర్డీ మలోలా, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయ కుమార్, సమాచార శాఖ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, డి ఈ ఓ..ప్రసాద్ బాబు, కలెక్టరేట్ ఏ.వో. అలెగ్జాండర్ వివిధ సంస్థలప్రతినిధులు,పలువురుకళాకారులు పాల్గొనినివాళులు అర్పించారు. శాఖలకు చెందిన అధికారులు, వివిధ కళా కలెక్టరేట్ ఉద్యోగ సిబ్బంది తదితరులు
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలితరం తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డల్లోమన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బళ్లారి రాఘవ ఒకరని అన్నారు. తనదైన శైలిలో నాటకరంగానికి వన్నె తెచ్చిన మహానటుడని పేర్కొన్నారు. సాహిత్యం, నటన ప్రతిభాపాటవాలు బళ్లారి రాఘవకు బాల్యం నుంచే అలవడ్డాయన్నారు. అంతేగాక బళ్లారి రాఘవ సామాజిక సంస్కర్త అని వీరి జీవితం నేటి సమాజంలోని ప్రతిఒక్కరికి ఎంతో ఆదర్శవంతమైనదని అన్నారు.1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లా తాడిపత్రిలో శేషమ్మ మరియు నరసింహచార్యులు అనే పుణ్య దంపతులకు జన్మించారని అయితే బళ్లారిలో స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వలన బళ్లారి రాఘవ గా ప్రసిద్ధులయ్యారని పేర్కొన్నారు.
మద్రాసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించి సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారన్నారు. అలాగే బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ ను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించి ప్రజల నుంచి మన్ననలు పొందారన్నారు. వీరి ప్రజ్ఞా పఠవాలను గుర్తించి అప్పటి ఆంగ్ల ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానిమించడమే కాకుండా లాల్ బహుదూర్ అనే బిరుదుతో సత్కరించినట్లు ఇన్చార్జి కలెక్టర్ గుర్తు చేశారు. అత్యంత ధనవంతుడైనప్పటికి నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి బళ్లారి రాఘవ అని తెలిపారు.
ఇలాంటి మహనీయుని జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో శుభపరిణామం హర్షించ దగ్గ విషయమని అన్నారు. కళలను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కళాకారులను గౌరవించడం మనందరి కర్తవ్యం అన్నారు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జార్జిబెర్నార్డ్ షా, మహాకవి శ్రీశ్రీ లాంటి ఎందరో మహానుభావులు వీరి నాటకాల ప్రదర్శన పట్ల ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. ముఖ్యంగా బళ్లారి రాఘవ మహిళలను నాటకరంగస్థలం అభినయించటానికి ప్రోత్సహించారని తెలిపారు.
నాటక పితామహుడు బళ్లారి రాఘవ... అని డిఆర్ మలోలా తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన సహజ నటుడని, ఎంతోమంది కళాకారులను తీర్చి దిద్దిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. నాటకాలు, ఉద్యమాలు, సినీరంగంలోను తనదైన నటనతో జిల్లా ఖ్యాతిని చాటిన బళ్ళారి రాఘవ పేరుమీద కళాకారులకు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు నెలకొల్పడం నాటక రంగానికి అయన చేసిన సేవలే నిదర్సనమన్నారు. చరిత్రలో బళ్ళారి రాఘవ సేవలు చిరస్మరణీయంగా
ఉంటాయన్నారు
ముఖ్యంగా మహిళలను నాటక రంగంలో ప్రోత్సహించిన గొప్ప మహనీయులని, అద్భుత నటనతో ప్రజలు మరియు కళాకారుల్లో సామాజిక చైతన్యం కలిగిస్తూ నాటకాలను బళ్లారి రాఘవప్రోత్సహించాన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి మన జిల్లా వాసులుకావడం మనందరికీ ఎంతో గర్వకారణమని డిఆర్ కొనియాడారు.
ఒక సందర్భంలో బళ్లారి రాఘవ స్ఫూర్తితో తాను కూడా ఒక నాటకంవేశానని గతంలో బాల కార్మికవ్యవస్థనిర్మూలలపై తాను వేసి నాటకం ఫలితంగా విద్యార్థుల్లో తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను బ్రిడ్జి పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నాటకరంగాన్ని ఆదరించవలసిన అవసరం ఉందన్నారు. సామాజిక మార్పుకు నాంది నాటక రంగమని డిఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా కళలను కళాకారులను ప్రోత్సహించే దిశగా తమ వంతుగా కృషి చేస్తామని డిఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ విభాగాలనూపరింటెండ్ లు యోగేశ్వరి దేవి, రియాజ్ కళా సంస్థ ప్రతినిధి మైకేల్ బాబు పాల్గొన్నారు.