ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ నామినేసన్ల స్వీకరణ
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ నామినేసన్ల స్వీకరణ
- అసాధారణ ప్రతిభా విజయాలు కలిగిన చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్
- ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును బహుకరంచనున్న భారత ప్రభుత్వం
- కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి త్రిప్తి గుర్హ
వివిధ రంగాలలో పిల్లల అసాధారణ విజయాలను గుర్తించి వారిని అభినందించడానికి భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) వంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును బహుకరంచనుందని కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి త్రిప్తి గుర్హ తెలిపారు. యువతకు మార్గదర్శకత్వం వహించడానికి ఏర్పాటు చేయబడిన ఈ అవార్డును ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ & సంస్కృతి మరియు సైన్స్ & టెక్నాలజీ అనే నాలుగు విభాగాల కింద అందించనున్నది. ఈ రంగాలలో నైపుణ్యం మరియు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు (జూలై 31, 2025 నాటికి) నామినేట్ కావడానికి అర్హులని త్రిప్తి గుర్హ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) అవార్డు ఎంపిక ప్రక్రియను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర సంబంధిత సంస్థల నుండి నామినేషన్లను స్వీకరిస్తారని, PMRBP నామినేషన్లు/సిఫార్సులు ఆన్‌లైన్‌లో భారత ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని త్రిప్తి గుర్హ స్పష్టం చేసారు.
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో నామినేషన్లు అందుతున్నప్పటికీ, అర్హులైన చాలా మంది పిల్లలు ప్రజల్లో గుర్తింపు కోరుకోకపోవడంతో వారి ప్రతిభ కనుమరుగవుతుందని, కావున సాధ్యమైనంత ఎక్కువగా అర్హులైన పిల్లలను గుర్తించడంలో సమిష్టి ప్రయత్నాలు చేయాలని మరియు వారికి అనుకూలంగా తగిన నామినేషన్లు చేయాలని కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కోరుతున్నది.
PMRBP కోసం నామినేషన్లను సులభతరం చేయడానికి ఒక్కో విభాగం కొరకు ఒక్కో ప్రత్యేక లాగిన్ ID లను కేటాయించబడిందని, సిఫార్సులను ఖరారు చేసేటప్పుడు, ఈ క్రింది అంశాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
1. సిఫార్సు చేయబడిన పిల్లలు జాతీయ స్థాయి అవార్డుకు అర్హులా కాదా, వారి విజయాలలో భాగంగా ప్రజా సేవ కూడా మిళితమై ఉందా లేదా అని పరిశీలన చేయాలి.
2. బాలికలు, బలహీన వర్గాలు, SC/ST సంఘాలు మరియు దివ్యాంగుల నుండి ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలనీ త్రిప్తి గుర్హ సూచించారు.
PMRBP కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులు 1 ఏప్రిల్, 2025 నుండి ప్రారంభమయ్యాయి మరియు నామినేషన్లకు చివరి తేదీ 31" జూలై, 2025 వరకు ఉండగా నామినేషన్ల స్వీకరణ గడువు 15 ఆగష్టు 2025 వరకు పొడిగిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కావున ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కింద గుర్తింపు పొందాల్సిన అత్యుత్తమ విజయాలు మరియు ప్రతిభ కలిగిన పిల్లలను నామినేట్ చేయడాన్ని అన్ని శాఖల వారు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి త్రిప్తి గుర్హ కోరారు.