పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు సన్నాహాలు
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు సన్నాహాలు
జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తీ చేయాలని సూచించిన జిల్లా ఎస్పీ జగదీష్
అనంతపురం :
ఇటీవల ఎంపికైన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో శిక్షణార్థులకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించేందుకు స్థానిక జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) బుధవారం జిల్లా ఎస్పీ జగదీష్ సందర్శించారు. అనంతరం డి.టి.సి, పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్ లు, కిచెన్, జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ ను పోలీస్ అధికారులతో కలసి పరిశీలించి, శిక్షణ నిమిత్తం అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అలాగే, డిటీసీలో చేపట్టవలసిన మరమ్మత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు అందించారు. అనంతరం, శిక్షణార్థులకు శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే గ్రౌండ్ పరిశీలించారు. రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. శిక్షణ కేంద్రంలో అదనపు సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకి ప్రత్యేక శ్రద్ధ అవసరమని, పరిసరాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట డి.టి.సి డి.ఎస్.పి డి.టి.సి సూర్యనారాయణరెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్ ఐ మధు ఉన్నారు.