రైతులు యూరియా కొరకు ఆందోళన చెందవద్దు
రైతులు యూరియా కొరకు ఆందోళన చెందవద్దు
- శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, ఆగస్టు,20:
జిల్లాలో రైతులు యూరియా కొరకు ఆందోళన చందవద్దని, రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా వ్యవసాయేతర అవసరాలకు వాడకుండా తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు సాగు చేసుకునే పంటలకు అవసరమైన యూరియా లభ్యత గురించి సమీక్షిస్తూ జిల్లాలో ఈరోజు వరకు 4700 టన్నుల యూరియా ఉందని అందువలన రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియాను వ్యవసాయ సంబంధిత అవసరాలకు కాకుండా ఇతర పారిశ్రామిక అవసరాలకు మళ్లించినా, ఎరువుల డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా కఠిన, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో శాఖ జెడి సుబ్బారావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీ కృష్ణారెడ్డి, ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారి ఉదయ్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి, మహేష్, లేబర్ శాఖ కమిషనర్ సూర్యనారాయణ, డి ఎ హెచ్ ఓ డాక్టర్ ఎన్ శుభదాసు, తదితర అధికారులు పాల్గొన్నారు.