ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ
2,778 పోస్టులు మంజూరు
అమరావతి :
- ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
- డిప్యుటేషన్ / ఔట్సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్పై వినియోగించుకోనున్నారు. 993 కొత్త ఏఎన్ఎం / వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు.
నియామకాలు.. పర్యవేక్షణ ఇలా..
- గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆరుగురిని, డైరెక్టరేట్ నుంచి ఆరు గురిని డిప్యుటేషన్పై ఫంక్షనల్ అసిస్టెంట్లుగా తీసుకుంటారు.
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి 17 మంది జాయింట్ డైరెక్టర్/ డీఎల్డీఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ/ వార్డు సచివాలయ శాఖ అధి కారిగా నియమిస్తారు. ఆ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు, 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, 52 మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు, 104 మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్పై తీసుకుంటారు. 26 మంది ఆఫీసు సబార్డినేట్లను ఔట్సోర్సింగ్ ద్వారా నియమిస్తారు.
- మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్పై నియమిస్తారు.
- పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్ డైరెక్టర్ కమ్ అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు సెలక్షన్ గ్రేడ్ /జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమీషనర్లగా,మరో 9 మంది జిల్లా గ్రామ/ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్ పై నియమిస్తారు.
Comments