గణేష్ నిమజ్జన కార్యక్రమాలుప్రశాంతంగా నిర్వహించుకోవాలి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గణేష్ నిమజ్జన కార్యక్రమాలుప్రశాంతంగా నిర్వహించుకోవాలి
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న
శ్రీ సత్యసాయి జిల్లా:
- జిల్లాలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ పరంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న తెలియజేశారు.
- పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం , కదిరి సబ్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విగ్రహాల నిమజ్జన సమయంలో అనుచరించాల్సిన నియమాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
- నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని నిర్వాహకులకు సూచించారు.
- జిల్లాలోని అన్ని విగ్రహాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రాంతాల వారీగా విగ్రహాల వద్ద గస్తీలు చేపడుతున్నారన్నారు.
- విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశాలు కూడా వివిధ శాఖలతో అధికారులతో కలిసి గుర్తించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
డీజే శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
- ఊరేగింపు సమయంలో ఎవరూ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదన్నారు.
- నిమజ్జనం సమయంలో చిన్నపిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
- బందోబస్తులో భాగంగా అత్యాధునిక సి.సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
- వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు, పీస్ కమిటీలు సంయుక్తంగా కృషి చేయాలని ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీస్ నియమ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి తెలియజేశామన్నారు.
- వినాయక ఊరేగింపులో మద్యం సేవించిన వారు ఉండకుండా కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జన ఊరేగింపు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
- క్రమ పద్దతిలో విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేసేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.
- ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అసాంఘిక శక్తులు, అల్లరిమూకలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
- నిమజ్జన చేసే ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేసామన్నారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏదైనా సహాయం కోసం లేదా సమాచారం కోసం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ను లేదా 112 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
Comments