అర్హులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి
అర్హులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
కర్నూలు, ఆగస్టు 28:- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పలు ప్రభుత్వ అంశాలపై సమీక్షించారు.
గురువారం సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజయవాడ నుండి అన్ని జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మైనర్ఇరిగేషన్ ట్యాంక్ లు, గ్రౌండ్ వాటర్ లెవెల్, పెన్షన్ లు,యూరియా సరఫరా పి.ఎం. కుసుమ్ కు మరియు ఎయిర్ ఫోర్స్ కొరకు భూమి సేకరణ,జూవైనల్ కేసులు,పాజిటివ్ పబ్లిక్ పెరసెప్షన్ వంటి మెదలగు విషయాలు చర్చించి తగు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్బంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ... అర్హులైన వారందరికీ పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ విషయం లో జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి తో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాక్యుమెంట్ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సబ్ స్టేషన్ లకు మరియు ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు వీలైనంత త్వరగా అందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ సమావేశానికి జెసి డాక్టర్ బి.నవ్య,అడిషనల్ ఎస్పి హుసేన్ పీరా, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,ఇరిగేషన్ సిఈ బాలచంద్రారెడ్డి, డిఆర్డిఏ పి.డి రమణారెడ్డి, డ్వామా పిడి వెంకట రమణయ్య,కర్నూలు మున్సిపల్ కమీషనర్ విశ్వనాధ్, డిపిఓ భాస్కర్, జెడి అగ్రికల్చర్ వరలక్ష్మి, పి ఆర్ ఎస్ ఈ మద్దన్న,ట్రాన్సకో ఈఈ ఓబులేసు, ఐసిడిఎస్ పిడి విజయ, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీనివాసులు, మైనారిటీస్ ఆఫీసర్ సాబీహాపర్వీన్, డి ఎం మార్కఫెడ్ గద్వాల్ రాజు మొదలగు అధికారులు పాల్గొన్నారు.