జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, కర్నూలు.
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, కర్నూలు.
డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
మెగా డీఎస్సి-2025 నిర్వహణలో భాగంగా సర్టిఫికెట్ల ధ్రువీకరణ కేంద్రాలను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నవ్య సందర్శించారు. విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ప్రతాప్ రెడ్డి, అబ్రహం, కర్నూలు జిల్లా విద్యాధికారి ఎస్ శ్యామ్యూల్ పాల్ నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డిలతో కలసి రాయలసీమ విశ్వవిద్యాలయంలోని ఆరు కేంద్రాలను, అలాగే వెంకటేశ్వర బీఈడీ కాలేజీ,శ్రీనివాస బీఈడీ కాలేజీ లోని వెరిఫికేషన్ కేంద్రాలను పరిశీలించారు. వెరిఫికేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. సర్టిఫికెట్ల పరిశీల నిమిత్తం ఏ ఏ ప్రమాణాలు పాటిస్తున్నారన్న విషయాలపై అధికారులతో చర్చించారు. క్యాస్ట్ సర్టిఫికెట్ ధ్రువీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆన్లైన్ విధానంలో ప్రక్రియ మరింత వేగమతం అవ్వాలని ఆలస్యమయ్యేందుకు అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించి అనుకున్న సమయంలో పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రక్రియ తీసుకున్నదని వివరించారు. సర్టిఫికెట్ ధ్రువీకరణ సందర్భంగా అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా అధిగమించాలనే విషయాలపై విద్యాశాఖ అధికారులు వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెరిఫికేషన్ బృందాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని తొలిరోజు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వీరుతోపాటు జిల్లా విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.