రేపు పట్టణ ప్రణాళిక సమస్యలపై ఓపెన్ ఫోరం
రేపు పట్టణ ప్రణాళిక సమస్యలపై ఓపెన్ ఫోరం
•నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
•పౌరుల సమస్యలకు సత్వరమే పరిష్కారం
నగరపాలక సంస్థ;29-08-2025శుక్రవారం
కర్నూలు నగరంలో పౌరుల సమస్యలను ప్రత్యక్షంగా విని, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు శుక్రవారం “ఓపెన్ ఫోరం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎస్బిఐ ఉద్యోగుల కాలనీ మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్, నిర్మాణ అనుమతులు వంటి సేవలలో తలెత్తుతున్న ఇబ్బందులపై పౌరులు తమ సమస్యలను నేరుగా చెప్పవచ్చన్నారు.
పౌరుల ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశిస్తామని కమిషనర్ తెలిపారు. నగర ప్రజల నుండి అందిన సూచనలు, ఫిర్యాదులు మున్సిపల్ పాలనలో పారదర్శకత పెంచడమే కాకుండా వేగవంతమైన సేవలందించేందుకు తోడ్పడతాయని ఆయన వివరించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.