రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అమెరికాలో బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలపై 100% సుంకం భారతీయ జనరిక్ ఔషధాలకు ఇప్పటికి ఉపశమనం...

Current Affairs Today Current Affairs news Current Affairs PDF Current Affairs of India Today Current Affairs PDF Daily current affairs Latest GK&CA
Mounikadesk

అమెరికాలో బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలపై 100% సుంకం
భారతీయ జనరిక్ ఔషధాలకు ఇప్పటికి ఉపశమనం...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి అయ్యే బ్రాండెడ్ మరియు పేటెంట్ పొందిన ఔషధాలపై 100% సుంకం విధించారు. ఈ నిర్ణయం అక్టోబరు 1 నుండి అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతానికి ఈ నిర్ణయం భారతదేశానికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు ఎందుకంటే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలలో ఎక్కువ శాతం జనరిక్ ఔషధాలే. వీటిపై ప్రస్తుతానికి సుంకాలు విధించలేదు.

భవిష్యత్తులో జనరిక్ ఔషధాలపై కూడా ట్రంప్ సుంకాలు విధిస్తారేమోనని భారతీయ ఫార్మా కంపెనీలు మరియు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశం-అమెరికా వాణిజ్యం:

గత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం వివిధ దేశాలకు 30 బిలియన్ డాలర్ల (₹2.64 లక్షల కోట్లు) విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది.

అందులో దాదాపు మూడో వంతు (సుమారు 10 బిలియన్ డాలర్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి.

అమెరికాలో వినియోగించే జనరిక్ ఔషధాలలో 47% వాటా భారతదేశానిదేనని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (Pharmexcil) చైర్మన్ నమిత్ జోషి పేర్కొన్నారు.

దీర్ఘకాలిక వ్యూహాలు మరియు సలహాలు

స్వయం సమృద్ధి: ఫార్మా నిపుణులు ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు. బల్క్ ఔషధాలు మరియు ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) విభాగంలో పరిశోధన మరియు అభివృద్ధిని పెంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

వివిధ దేశాలపై దృష్టి: కేవలం అమెరికా మార్కెట్పై ఆధారపడకుండా తక్కువ ధరలకు కొత్త మందులను ఉత్పత్తి చేసి ఇతర దేశాల మార్కెట్లలో విస్తరించాలని సూచిస్తున్నారు.

కొత్త విభాగాలపై పెట్టుబడులు: పెప్టైడ్స్, బయోసిమిలర్ ఔషధాలు, కార్-టీ సెల్ థెరపీ, మరియు టీకాల విభాగాలలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ సహకారం అవసరం అని పేర్కొంటున్నారు

జనరిక్ ఔషధాలు (Generic Drugs):

ఇవి పేటెంట్ గడువు ముగిసిన తర్వాత ఇతర కంపెనీలు తయారుచేసే ఔషధాలు.ఇవి బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే ఉంటాయి కానీ పేటెంట్ లేకపోవడం వల్ల వాటి ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడానికి జనరిక్ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తాయి.

పేటెంట్ ఔషధాలు (Patented Drugs):

ఇవి కొత్తగా కనిపెట్టిన మందులు. పేటెంట్ హక్కు ఉన్నంతవరకు, కేవలం ఆవిష్కర్త కంపెనీ మాత్రమే వాటిని తయారు చేసి విక్రయించగలదు.

పేటెంట్ గడువు ముగిసిన తర్వాతే ఇతర కంపెనీలు వాటి జనరిక్ వెర్షన్లను తయారుచేయగలవు.

ట్రాఫిక్(Tariff):

ఇది ఒక దేశం తమ దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను.

ఇది దేశీయ పరిశ్రమలను విదేశీ పోటీ నుండి రక్షించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA):

IPA అనేది భారతదేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల సమూహం. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, జైడస్ వంటి 23 అగ్రగామి కంపెనీలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇది ఫార్మా పరిశ్రమ తరపున విధానపరమైన చర్చలలో పాల్గొంటుంది.

Comments

-Advertisement-