15 నెలల కూటమి పాలనతో... 15 ఏళ్ల భవితకు పునాది : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
15 నెలల కూటమి పాలనతో... 15 ఏళ్ల భవితకు పునాది : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
- ఆర్ధిక కష్టాలను దాటి సూపర్ 6 - సూపర్ సక్సస్ చేశాం
- అనంత సూపర్ సిక్స్ – సూపర్ సక్సస్ సభను విజయవంతం చేయాలని పిలుపు
- ప్రజలకు ఆర్ధికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- వైసీపీ అన్నదాత పోరుకు.... రైతన్నల నుంచి స్పందన కరువు..
- వైసీపీ ప్రతిపక్షం కాదు.. ఒక విష వృక్షం
- నాడు రైతు పంట బీమాకు ఎగనామం పెట్టి.. నేడు నీతులు చెబుతోన్న వైసీపీ..
నేడు ప్రజలకు సంక్షేమం - అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడంలో గత 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సస్ అయ్యిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి, కష్టాలను ఎదురీది, సూపర్ 6 ను సూపర్ సక్సస్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు... ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంటే, వైసీపీ నేతల్లో నేడు గుబులు మొదలయ్యిందన్నారు.. దీంతో రాష్ట్రంలో ఏదో జరగకూడనిది జరిగిపోతుందని, పదేపదే తన సొంత మీడియా, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అభివృద్ధి నిరోధకారిగా మారి వైసీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే పనిలో నిమగ్నమై ఉంది.. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఎంతమాత్రం లేరనే విషయం ఇప్పటికైనా గుర్తించాలన్నారు...
రాష్ట్రంలో వైసీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రాభివృద్ధి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.. కేవలం తన ఉనికి కాపాడుకోవడం, స్వార్థ రాజకీయాల కోసం.. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను సైతం వైసీపీ మార్కు బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డుకుంటుంది.. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస మౌలిక అవసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలో చేష్టలుడిగి చూస్తూ ఉన్న వైసీపీ ప్రభుత్వం.. నేడు క్షేత్ర స్థాయిలో జరిగే ప్రతీ అంశానికి స్పందించే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం దురదృష్టకరం.. కేవలం కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా రోజుకో అజెండా, పూటకో అంశం తీసుకుని ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది..
వైసీపీ ప్రతిపక్షం కాదు.. ఒక విష వృక్షం.
కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలుతో దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం నేడు రాష్ట్రంలో ప్రజలకు అందుతోంది. అయినప్పటికీ అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రతిపక్ష వైసీపీ తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు, కుట్ర రాజకీయాలకు పాల్పడుతూనే ఉంది. రాష్ట్రంలో 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతీ నెలా ఇంటివద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం తీసుకొచ్చాం.. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఒక్క పెన్షన్ లకే మన రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే రూ.33,000 కోట్లు ఖర్చు చేశాం. తల్లికి వందనం పథకంతో రూ.10 వేల కోట్లతో ఒక్కో విద్యార్ధికి రూ.15 వేల చొప్పున మొత్తం 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసి.. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ వర్తింప చేశాం.. దీపం-2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి వంటింటి ఖర్చు తగ్గించాం. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి 2 కోట్ల రాయితీ సిలిండర్లు దీపం పథకం కింద ఇవ్వడం జరిగింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి, త్వరలో నియామకాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
వైసీపీ అన్నదాత పోరుకు.... రైతన్నల నుంచి స్పందన కరువు..
కొత్త భిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా నేడు వైసీపీ నేతలు.. అన్నదాత పోరు పేరుతో రైతులను రెచ్చగొట్టేందుకు సరికొత్త నాటకానికి తెరతీశారు... అయితే ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో రైతన్నల నుంచి స్పందన కరువయ్యింది.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నేడు కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తోంది.. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో అమలులో భాగంగా అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేసి చూపింది.. ప్రతీ రైతుకు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు... 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించడం జరిగింది... నేడు అన్నదాత పోరంటూ కపట నాటకం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం.. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్ల పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రైతు వాటా కింద నయాపైసా చెల్లించకుండా రైతుల పంట బీమాకు ఎగనామం పెట్టిన వైసీపీ నేడు నీతులు వల్లిస్తోందన్నారు.
రైతులు ఆందోళన వద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది..
రాష్ట్రంలో యూరియా కొరత, ఉల్లి ధరలు తగ్గడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.. జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ సక్రమంగా సాగుతోంది.. అయితే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో, రైతులు తీవ్ర ఆందోళనకు గురికావడంతో పాటు, కొన్నిసార్లు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొనడంతో క్షేత్రస్థాయిలో కృత్రిమ కొరత కారణమవుతోంది.. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కు ఆస్కారం లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు.. అదే సమయంలో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని యూరియా నిల్వలు రానున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి భరోసా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉల్లి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు సహకరిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే రూ. 1200 కు క్వింటాళ్లు ఉల్లిని కొనుగోలు చేస్తుందన్నారు. అంతకు మించి ఉల్లి ధర తగ్గకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగింది. వరుస వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడం, నాణ్యతా ప్రమాణాలు తగ్గడం కూడా ఉల్లి ధరల పతనానికి కారణమని, అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఉల్లి రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు..
అనంత సభను విజయవంతం చేయాలని పిలుపు
అనంతపురంలో ఈ నెల 10 న జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.. ముఖ్యంగా రాయలసీమలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా.. బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరడం జరిగింది..
వైద్య కళాశాలల ప్రవేటీకరణ అంటూ వైసీపీ దుష్ప్రచారం
రాష్ట్రంలో వైద్యకళాశాలను ప్రవేటీకరిస్తున్నట్లు వైసీపీ తన అసత్య ఆరోపణలకు పదునుపెట్టి తీవ్రస్థాయిలో చేస్తోన్న దుష్ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని మంత్రి మండిపడ్డారు... మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజలకు మరింత సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు మాత్రమే పీపీపీ విధానంను ప్రభుత్వం తీసుకురావడం జరుగుతోందన్నారు. ఈ చర్యల కారణంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు పెరిగేందుకు కూడా ఈ నిర్ణయం సానుకూలంగా మారుతుందన్నారు.. 14 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 4 శాతం నిధులు ఆరోగ్య శాఖకు కేటాయించాల్సి ఉండగా, గత 5 ఏళ్లలో కేవలం 1 శాతం నిధులు కేటాయించిన జగన్ మోహన్ రెడ్డి పేదలకు వైద్య సేవలు, మెడికల్ సీట్ల గురించి మాట్లాడుతుండటం చూస్తే, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు.. 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తెచ్చానని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 ఏళ్లలో 17 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టని జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు....
