కేంద్రం నుండి మొదటి అవార్డు అందుకోనున్న మంత్రి..!!
కేంద్రం నుండి మొదటి అవార్డు అందుకోనున్న మంత్రి..!!
రాజకీయాలలో కొందరు కేవలం హోదా కోసం కూర్చుంటారు. కానీ, కొందరు మాత్రం తమ బాధ్యతను నిజమైన కర్తవ్యంగా భావించి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తారు. ఆ రెండో వర్గానికి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత.
బీసీ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మంత్రి సవిత ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా బీసీ వర్గాల విద్యార్థులు, యువత, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు రూపొందించడం, వాటిని సమర్ధవంతంగా అమలు చేయడం ఆమె ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్స్ , గ్రూప్స్ , రైల్వే , డీఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ప్రతి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కోచింగ్ సౌకర్యాలను అత్యుత్తమ స్థాయిలో కల్పించడం ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు సులభంగా అందేలా చేస్తున్నారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, వేలాది కుటుంబాల భవిష్యత్తు మార్పుకు దారితీసే ఒక పెద్ద అడుగు అని రుజువు అయ్యింది.
బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా బీసీ వర్గాల అభివృద్ధిని కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బలంగా వినిపిస్తూ, వారి హక్కులను సాధించేందుకు మంత్రి సవిత నిరంతరం కృషి చేస్తున్నారు. దీనికి గుర్తింపుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీసీ శాఖకు "స్కాచ్ అవార్డు" రావడం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత ఫలప్రదంగా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది.
మంత్రి సవిత విధానం వల్ల బీసీ లలో రెండు ముఖ్యమైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఒకటి ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుతోంది అలాగే ప్రభుత్వానికి మంచి పేరు, విశ్వసనీయత పెరుగుతోంది.
ప్రజల మేలు కోసం ఒక శాఖ ఎంత అంకితభావంతో పనిచేయగలదో మంత్రి సవిత నిరూపిస్తున్నారు. ఇలాంటి నేతలు ఉన్నంతకాలం ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై మరింతగా పెరుగుతుంది.
మొత్తానికి, బీసీ శాఖను ప్రజలకు చేరువ చేసి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్న మంత్రి సవిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అమూల్యమైన ఆస్తిగా నిలుస్తున్నారు. అలాగే కేంద్రం నుండి ఇలాంటి అవార్డు అందుకోబోతున్న మొదటి మహిళా మంత్రిగా ఆమె నిలవనున్నారు. బిసి శాఖలో హామీ చేస్తున్న కృషికి ఈ అవార్డు రావడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రులు నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
