తెలంగాణలో తొలి సంపూర్ణ సౌర గ్రామం నాగర్కర్నూల్ జిల్లాలో కొండారెడ్డిపల్లి 1.5 మెగావాట్ సామర్థ్యంతో వెలుగులు
తెలంగాణలో తొలి సంపూర్ణ సౌర గ్రామం నాగర్కర్నూల్ జిల్లాలో
కొండారెడ్డిపల్లి 1.5 మెగావాట్ సామర్థ్యంతో వెలుగులు
నాగర్కర్నూల్ జిల్లా, వంగూర్ మండలంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి, దక్షిణ భారతదేశంలోనే తొలి సంపూర్ణ సౌరవిద్యుత్ గ్రామంగా మారనుంది.
ఈ ప్రాజెక్ట్ను ₹10.58 కోట్ల వ్యయంతో తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (T-GREDCO) చేపట్టింది.
గ్రామంలోని మొత్తం 514 ఇళ్లు మరియు 11 ప్రభుత్వ భవనాలపై సౌరఫలకాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సౌరఫలకాలు బిగించారు. మొత్తం గ్రామ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 1,500 కిలోవాట్లకు చేరింది.
సౌర విద్యుత్ ప్రాముఖ్యత:
పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర విద్యుత్ అనేది సూర్యకాంతి నుండి ఉత్పత్తి అవుతుంది. ఇది స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల మరియు పునరుత్పాదక శక్తి వనరు.
ఆర్థిక ప్రయోజనాలు: ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామస్థులకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ప్రతి ఇంటిపైనా ఉత్పత్తి అయిన విద్యుత్లో ఇంటి అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్ను యూనిట్కు ₹5.25 చొప్పున విద్యుత్ గ్రిడ్కు విక్రయిస్తున్నారు. దీని ద్వారా గ్రామస్థులు నెలకు ₹5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.
ఆర్థిక నమూనా(Financial Model):
ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం నుంచి ₹3.56 కోట్ల రాయితీ లభించగా, ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ తమ సీఎస్ఆర్ (CSR - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ₹4.09 కోట్లు భరించింది.
డిస్కం (DISCOM): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ఈ ప్రాజెక్ట్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇది గ్రిడ్కు సరఫరా అయిన విద్యుత్కు గ్రామస్థులకు చెల్లింపులు చేస్తుంది
