రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారత ఆర్చర్ శీతల్ దేవి గ్యాంగ్ జులోలో త్రిపుల్ మెడల్ విజయం రెండు చేతులు లేకుండా ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణం సాధించిన తొలి మహిళ...

Current Affairs Today Current Affairs news Current Affairs PDF Current Affairs of India Today Current Affairs PDF Daily current affairs Latest GK&CA
Mounikadesk

భారత ఆర్చర్ శీతల్ దేవి గ్యాంగ్ జులోలో త్రిపుల్ మెడల్ విజయం
రెండు చేతులు లేకుండా ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణం సాధించిన తొలి మహిళ...

దక్షిణ కొరియాలోని గ్యాంగ్ జులో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ పోటీలలో భారత క్రీడాకారిణి శీతల్ దేవి అసాధారణ ప్రతిభను ప్రదర్శించి మూడు పతకాలను సాధించింది ఒక స్వర్ణం, ఒక రజతం మరియు ఒక కాంస్యం.

స్వర్ణ పతకం: మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన టర్కీకి చెందిన క్లూర్ గిసిట్ను 146-143 తేడాతో ఓడించి స్వర్ణాన్ని గెలుచుకుంది.

రజత పతకం: మహిళల టీమ్ విభాగంలో సరితతో కలిసి రజతం గెలుచుకుంది.

కాంస్య పతకం: మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్ కుమార్తో కలిసి కాంస్యం సాధించింది.

సాధించిన రికార్డు: రెండు చేతులు లేకపోయినా వ్యక్తిగత పసిడి పతకం గెలుచుకున్న తొలి మహిళా ఆర్చర్ గా శీతల్ దేవి రికార్డు సృష్టించింది.

నేపథ్యం:

శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్లోని అన్లచిత్ ప్రాంతానికి చెందినవారు.

పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించారు.అయినా, ఆమె శారీరక వైకల్యాన్ని అడ్డురానివ్వకుండా ఆర్చరీలో అసాధారణ ప్రతిభ కనబరిచారు.

ఆమె ఆర్చరీ పద్ధతి:

చేతులు లేకపోవడం వల్ల, శీతల్ దేవి విల్లును భుజాలతో పట్టుకుని, నోటితో బాణాలను లాగి లక్ష్యాన్ని ఛేదిస్తారు. ఈ పద్ధతి చాలా కష్టమైనప్పటికీ, ఆమె అపారమైన మానసిక ధృఢత్వంతో సాధన చేశారు.

ప్రేరణ:

2013లో పారాలింపిక్స్లో నోటితో బాణాలు సంధించి రజతం గెలుచుకున్న బ్రిటన్కు చెందిన మాట్ స్టట్స్మాన్ ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు.

మునుపటి విజయాలు:

2023 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచారు.

పారా కాంపౌండ్ ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు.

2024 పారిస్ పారాలింపిక్స్లోలో రజతం సాధించారు.

2023 ఆసియా పారా గేమ్స్ రెండు స్వర్ణాలు మరియు ఒక రజతం గెలుచుకున్నారు.

2024 పారిస్ పారాలింపిక్స్ లో రాకేశ్ కుమార్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకున్నారు. ఆ క్రీడల్లో పతకం గెలిచిన భారత పిన్న వయసు ఆర్చర్గా రికార్డు సృష్టించారు

Comments

-Advertisement-