ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం 152 ఓట్ల మెజారిటీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం 152 ఓట్ల మెజారిటీ
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు:
మొత్తం ఓట్లు: 767
సి.పి. రాధాకృష్ణన్కు లభించిన ఓట్లు: 452 (60.10% చెల్లుబాటు అయిన ఓట్లు)
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లభించిన ఓట్లు: 300 (39.89% చెల్లుబాటు అయిన ఓట్లు)
చెల్లని ఓట్లు: 15
గెలుపుకు అవసరమైన ఓట్లు: 377
అదనపు బలం:
సి.పి. రాధాకృష్ణన్కు అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు (14 ఓట్లు) లభించాయి. ఇది ప్రతిపక్షాల నుండి జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా జరిగిందని భావిస్తున్నారు.
ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీలు:
BJD(7 ఎంపీలు), BRS(4 ఎంపీలు) మరియు శిరోమణి అకాళీదళ్ (1 ఎంపీ) ఓటింగు దూరంగా ఉన్నాయి.
ఉపరాష్ట్రపతి పదవి, ఎన్నికల వ్యవస్థ మరియు రాజ్యాంగ నిబంధనలు:
ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజ్యాంగం, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మరియు పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను వివరిస్తాయి
ఉపరాష్ట్రపతి పదవి మరియు ఎన్నికలు:
రాజ్యాంగ నిబంధనలు: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి మరియు రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతాయి.
ఎలక్టోరల్ కాలేజ్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోకసభ మరియు రాజ్యసభలోని అన్ని సభ్యులు (ఎన్నికైన మరియు నామినేటెడ్) పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికకు భిన్నంగా, ఈ ఎన్నికలో రాష్ట్ర శాసనసభల సభ్యులు పాల్గొనరు.
విప్ వర్తించదు: ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి, పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయలేవు.
ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ముఖ్యాంశాలు:
పదవీ కాలం: ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు.
రాజ్యసభ చైర్మన్: ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవి రీత్యా చైర్మన్గా (Ex-officio Chairman) వ్యవహరిస్తారు.
తాత్కాలిక రాష్ట్రపతి: రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆరు నెలల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
ఉపరాష్ట్రపతి అధికారాలు మరియు విధులు:
భారత ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. ఆయన ప్రధానంగా రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తారు.
1. రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్:
ఉపరాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 64 ప్రకారం రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్గా (Ex-officio Chairman of the Council of States) వ్యవహరిస్తారు
ఈ హోదాలో ఆయన అధికారాలు మరియు విధులు లోక్సభ స్పీకర్తో సమానంగా ఉంటాయి
రాజ్యసభలో సభా కార్యక్రమాలను నిర్వహించడం, సభలో క్రమశిక్షణను పాటించేలా చూడటం మరియు సభ్యులకు మాట్లాడే అవకాశాలు కల్పించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు.
సభలో సమాన ఓట్లు వచ్చినప్పుడు (టై అయినప్పుడు) ఆయన నిర్ణయాత్మక ఓటు (Casting Vote) వేయవచ్చు.
2. తాత్కాలిక రాష్ట్రపతి:
రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ అయినప్పుడు (మరణం, రాజీనామా, అభిశంసన లేదా ఇతర కారణాల వల్ల), ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.ఆర్టికల్ 65 ప్రకారం, ఈ పదవిలో ఆయన గరిష్టంగా ఆరు నెలల పాటు కొనసాగుతారు.
ఈ కాలంలో ఆయనకు రాష్ట్రపతికి ఉండే అన్ని అధికారాలు, అధికారిక హోదా, జీతం మరియు భత్యాలు లభిస్తాయి.తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన రాజ్యసభ చైర్మన్ విధులను నిర్వర్తించరు. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ విధులను చూసుకుంటారు.
భారతదేశ ఉపరాష్ట్రపతులు:
భారతదేశానికి ఇప్పటివరకు 15 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలందించారు. వీరిలో కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, మరికొందరు ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు:
ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వ్యక్తులు:
1.డా. సర్వేపల్లి రాధాకృష్ణన్: ఈయన 1952 మరియు 1957లలో రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత తొలి ఉపరాష్ట్రపతిగా 10 సంవత్సరాలు పనిచేసి, ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా సేవలు అందించారు.
2. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా: ఈయన 1979లో ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసి, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు.
డా. శంకర్ దయాళ్ శర్మ: ఈయన 1987లో ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తర్వాత భారతదేశానికి తొమ్మిదవ రాష్ట్రపతిగా సేవలు అందించారు.
ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనవారు:
ఈ ముగ్గురు కాకుండా మిగిలిన ఉపరాష్ట్రపతులందరూ ఎన్నికల ద్వారా ఈ పదవిని పొందారు.
- డా. జాకీర్ హుస్సేన్
- వి.వి గిరి
- గోపాల్ స్వరూప్ పాఠక్
- బీ.డీ జడ్జి
- ఆర్. వెంకటరామన్
- కె.ఆర్. నారాయణన్
- క్రిషన్ కాంత్
- భైరాన్ సింగ్ షెకావత్
- ముహమ్మద్ హమీద్ అన్సారీ (ఈయన రెండుసార్లు గెలిచారు)
- వెంకయ్య నాయుడు
- జగ్దేప్ ధన్ఫర్
- సి.పి. రాధాకృష్ణన్ (ప్రస్తుత ఉపరాష్ట్రపతి)
ప్రస్తుత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ 15వ వ్యక్తిగా ఈ పదవిని చేపట్టారు. వీరిలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
