రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎఫ్ఎంజీ విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పై ప్ర‌భుత్వం సానుభూతితో ఉంది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఎఫ్ఎంజీ విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పై ప్ర‌భుత్వం సానుభూతితో ఉంది

  • అర్హతలున్న వారికి ఎప్పటికప్పుడు ఎపిఎంసి క్లియ‌ర్ చేస్తోంది
  • ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎపిఎంసి న‌డుచుకుంటోంది
  • 17 నెల‌లుగా శాస్వ‌త రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌డంలేద‌నేది అవాస్త‌వం
  • నిన్న కూడా ఏడుగురికి శాశ్వ‌స రిజిస్ట్రేష‌న్లు ఎపిఎంసి జారీ చేసింది
  • దౌత్య కార్యాలయాల ద్వారా డిగ్రీ గుర్తింపు నిర్ధారణ త్వరగా జరిగేలా కేంద్ర మంత్రికి లేఖ
  • శాసన మండలిలో మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడి


విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు (ఎఫ్ఎంజీ) ఏపీ వైద్య మండలి ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ కల్పించే విషయాన్ని సానుభూతితో పరిశీలిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలు అనుసరిస్తూ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిగణనలోనికి తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ యాద‌వ్ సమాధానమిచ్చారు.

'ఎన్ఎంసీ నుంచి వచ్చే మార్గదర్శకాలు, సూచనలనుసరించి విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన వారికి ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్లు క‌ల్పిస్తుంది. కొవిడ్-19, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ఆన్లైన్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్లు ఎన్ఎంసీ 2022 నుంచి సమయానుకూలంగా మార్గదర్శకాలు విడుదలచేస్తూనే ఉంది. ఆన్లైన్లో క్లినికల్ ట్రైనింగ్ చేసినట్లు విద్యార్థులు కొందరు విద్యార్థులు ఏపీ వైద్య మండలి కార్యాలయానికి కంపెన్సిటేరి లేఖలు సమర్పించారు. అయితే.. ఎన్ఎంసీ మాత్రం ఆన్లైన్లో చదివిన కోర్సును ఆన్లైన్లోనే పూర్తిచేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల ఎన్ఎంసీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించక తప్పని ప‌రిస్థితి. ఎన్ఎంసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రాజస్థాన్ వైద్య మండలి రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. కర్ణాటక వైద్య మండలి రిజిస్ట్రార్ విధుల నుండి త‌ప్పించారు' అని మంత్రి సత్యకుమార్ వివరించారు.

318 మందికి శాశ్వత రిజిస్ట్రేషన్లు జారీ

"రాష్ట్ర వైద్య మండలి కార్యాలయానికి 2023, 2024లో కలిపి 653 మంది విద్యార్థుల నుంచి ఇంటర్నషిప్, శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తులొచ్చాయి. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం...దరఖాస్తుదారుల్లో 318 మంది శాశ్వత రిజిస్ట్రేషన్లు జారీ చేయ‌గా, ఇంకా 335 మందికి జారీ చేయాల్సి ఉంది. 335 మందిలో 100 మందికి అర్హతలున్నా.. సదరు దేశాల దౌత్య కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు రావాల్సి ఉన్నందున పెండింగ్‌లో ఉన్నాయి. 

40 మంది విద్యార్థులకు విదేశీ దౌత్య కార్యాలయాల నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చిన‌ప్పటికీ వీరు ఇంకా ఇంట‌ర్న్‌షిప్ చేస్తున్నందున‌ అర్హ‌తలేద‌ని నిలిపివేశారు. 224 మంది ఇంట‌ర్నిషిప్ చేస్తున్నందున భార‌త దౌత్య కార్యాల‌యం క్లియ‌రెన్స్ ఇవ్వాల్సి ఉంది. కొంత‌మంది విద్యార్థులు వేర్వేరు కార‌ణాల‌తో కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయస్థానం ఇచ్చిన రెండు రకాల తీర్పులపై స్పష్టత కోరుతూ డివిజన్ బెంచ్ లో ఎన్ ఎంసి సూచ‌న మేర‌కు ఏపీ వైద్య మండలి రివ్యూ పిటిషన్ వేసింది. ఎన్ఎంసి నిబంధ‌న‌ల్ని ఎపి మెడిక‌ల్ కౌన్సిల్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందేన‌ని నిన్న‌నే హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది' అని మంత్రి సత్యకుమార్ స‌భకు వివ‌రించారు.

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ

"విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థుల డిగ్రీల గుర్తింపు నిరారణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఈ నెల 19న లేఖ రాశాను. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండాలని చూడాలని కేంద్ర మంత్రిని కోరాను. శాశ్వత రిజిస్ట్రేషన్లు కోరే విదేశీ విద్యార్థుల గురించి నవంబరు 19, 2024న ఎన్ఎంసీ లేఖ రాసింది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసిన విశ్వవిద్యాలయాల డిగ్రీ గుర్తింపును భారత్ దౌత్య కార్యాలయం ద్వారా నిర్ధారించుకోవాలని ఆ లేఖ ద్వారా రాష్ట్రాలకు ఎన్ఎంసీ సూచించింది' అని మంత్రి సత్యకుమార్ వివరించారు.

ఎన్ఎంసీ నుంచి వచ్చిన నోటీసులు

"సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి ఎన్ఎంసీ 28.07.2022న ఓ పబ్లిక్ నోటీను జారీచేసింది. ఇందులో కొవిడ్-19 లేదా ఉక్రెయిన్ యుద్ధంవల్ల భారత్ కు తిరిగొచ్చిన చివరి సంవత్సరం విద్యార్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు తిరిగి నదరు విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సు కొనసాగింపులో కోల్పోయిన క్లినికల్ శిక్షణకు బదులు భారత్ లో రెండేళ్లపాటు ఇంటర్న్ షిప్ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఎన్ఎంసీ పేర్కొంది.

" పూర్తిగా ఆఫ్‌లైన్లో చదివిన విదేశీ విద్యార్థులు కూడాభారత్ లో ఏడాది ఇంటర్న్షిప్ పూర్తిచేయాలని ఎన్ఎంసీ నవంబరు 22, 2023 మరో పబ్లిక్ నోటీసు ఇచ్చింది. చివరి సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు క్లినికల్ శిక్షణ నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండేళ్లు (ఏడాదిపాటు క్లర్క్షాప్, మరో ఏడాది ఇంటర్న్ షిప్) పూర్తిచేయాలి' అని నోటీసులో పేర్కొన్నారు.

గత నెల 7న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఎన్ఎంసీ లేఖ

"విద్యార్థులు తాము కోల్పోయిన ఆన్లైన్ తరగతులను అంతే కాల వ్యవధితో ఆన్లైన్ విధానంలో చదవాలి. ఇలా చేస్తేనే కోర్సు పూర్తిచేసినట్లుగా గుర్తిస్తామని ఎన్ఎంసి ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన స్ప‌ష్టం చేసింది ' అని మంత్రి సత్యకుమార్ వివరించారు.

Comments

-Advertisement-