కన్నుల పండుగగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.
కన్నుల పండుగగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.
- ముఖ్య అతిధిగా కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు _
- అతిధులుగా పాల్గొన్న జనసేన ముఖ్య నాయకులు._
- సామినేని ఉదయభాను గారి అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు._
- భారీ సంఖ్యలో పాల్గొన్న జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు.
విజయవాడ, విద్యాధరపురం నందు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు ముఖ్య అతిధిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అతిధులుగా జనసేన నాయకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర MSME కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, మంగళగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు గారు, కృష్ణా జిల్లా DCMS చైర్మన్ బండి రామకృష్ణ గార్లతో పాటు పలువురు పాల్గొన్నారు._
ఈ సందర్భంగా కొణిదల నాగబాబు , సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని జన సైనికులకు సూచించారు. ప్రజా సమస్యలు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు కార్యాలయం దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కార దిశగా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క జనసైనికులు వీర మహిళలు కృషి చేయాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని అన్నారు. త్వరలో ప్రకటించబోయే రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు._
విజయవాడ రూరల్ మండలం నుండి పలువురు వైసీపీ నాయకులు ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరారు వారికి కొణిదల నాగబాబు , సామినేని ఉదయభాను పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ , ఆంధ్ర ప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్, చైర్మన్ చిలకలపూడి పాపారావు , APIIC డైరెక్టర్ మండలి రాజేష్ , ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ కృష్ణ , జనసేన పార్టీ PAC సభ్యులు పోతిరెడ్డి అనిత గారు, విజయవాడ నగర కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ ,అత్తులూరి వెంకటేశ్వరరావు(పెదబాబు) గారు, మరుపిల్ల రాజేష్ , సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ గారు, కృష్ణా-పెన్నా రీజనల్ కొ ఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి , విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ ఎన్నికల నిర్వహణ కమిటీ కో-కన్వీనర్ KSN మూర్తి, అజయ్ వర్మ ఠాకూర్ తిరుపతి అనూష సురేష్ , స్టాలిన్ శంకర్ , దాసాంజనేయ స్వామి దేవస్థాన ఛైర్మన్ సోడిశెట్టి రాధ , ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ,గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త బురగడ్డ శ్రీకాంత్ సందు పవన్ , గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి చలమలశెట్టి మహేష్ , రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అక్కల రామ్మోహన రావు(గాంధీ) నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు , జగ్గయ్యపేట సమన్వయకర్త బాడిశ మురళీ కృష్ణ , ఉమ్మడి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ,జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు , కౌన్సిలర్ కొలగాని రాము , జనసేన నాయకులు షౌకత్ అలీ , మైనారిటీ నాయకులు షేక్ సత్తార్ , కాశీ వెంకట కిశోర్ , ఆంధ్ర ప్రదేశ్ బిసి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి ప్రహ్లాద్ , ఉమ్మడి జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ , మేడూరి వెంకటాద్రి(బబ్లూ) గారుతో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, జనసేన చైర్మన్లు, జనసైనికులు, వీరామహిళలు భారీగా పాల్గొన్నారు.
