రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హామీలన్నింటిని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హామీలన్నింటిని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

  • సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ సూపర్ హిట్ గా అమలు చేస్తున్నాం
  • అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ విజయవంతం
  • ప్రతి పక్ష పార్టీ అక్కస్సుతో చేస్తున్న విమర్శలు, వ్రాస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదు
  • రాష్ట సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి


అమరావతి, సెప్టెంబరు 11: ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అధికారంలోకి వచ్చిన 16 మాసాల కాల వ్యవధిలోనే సూపర్ హిట్ గా కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ విజయవంతం అవ్వడమే కాకుండా సభా ప్రాంగణాన్ని దాటిపోయి దాదాపు 12 కి.మి. వరకు ప్రజలు బారులు తీరి నిల్చుండిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అత్యల్ప కావలవ్యవధిలోనే తమ కూటమి ప్రభుత్వం మోగించే విజయదుందుభిని తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్ష నాయకులు అక్కస్సుతో చేసే విమర్శలలో ఏమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. 

గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న వయస్సును, అనుభవాన్ని గౌరవించకపోగా, వారిపై శాపనార్థాలు పెట్టే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పర్చకపోగా, అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో దింపడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడంలోనే నాలుగైదు మాసాలు గడిచిపోయాయని, మిగిలిన ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. 

తమ ప్రభుత్వం ఏ ఒక్క పింఛన్ ను తొలగించలేదని, గతంలో ఉన్న పింఛన్లనే కొనసాగించిందన్నారు. పింఛన్ల రూపేణా గత ప్రభుత్వం మాసానికి రూ.1400 కోట్లు వెచ్చిస్తే తమ ప్రభుత్వం రూ.2,746 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు పొందుతూ భర్తను కోల్పోయిన వితంతువులకు వితంతు పింఛన్లు తమ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా పథకం క్రింద ప్రతి రైతుకు రూ.13 వేలు ఇస్తామన్న గత ప్రభుత్వం కేవలం రూ.7 వేలు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం అన్నధాతా సుఖీభవ పథకం క్రింద ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పి తొలి విడత సొమ్మును దాదాపు 47 లక్షల మంది రైతుల ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. ఈ రూ.20 వేలులో రూ.14 వేలు రాష్ట్ర వాటాగా ఇస్తుందని, మిగిలిన రూ.6 వేలను కేంద్ర వాటాగా అందజేయడం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. అమ్మఒడి పథకం క్రింద గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందజేస్తే తమ ప్రభుత్వం తల్లికి వందనం పథకం క్రింద కుటుంబంలోని విద్యార్థులు అందరికీ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం క్రింద తమ ప్రభుత్వం దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. హామీ ఇచ్చిన విధంగా దీపం-2 పథకం క్రింద దాదాపు కోటి మందికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. స్త్రీ శక్తి పథకం క్రింద దాదాపు 2.6 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద ప్రతి రోజూ దాదాపు 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుచున్నదన్నారు. ఇందుకై దాదాపు రూ.2 వేల కోట్లను ప్రభుత్వం భరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికే దాదాపు ఆరేడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగే పరిస్థితులను కల్పించడం జరిగిందన్నారు. మెగా డిఎస్పీ ద్వారా 16,672 ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఇప్పటికే దాదాపు 5.50 కోట్లు మంది కి ఆకలి తీర్చడం జరిగిందన్నారు. 2022 లో 17 వైద్య కళాశాలల నిర్మాణాలను రూ.8,480 కోట్లతో ప్రారంభించామని చెప్పుకున్న గత ప్రభుత్వం కేవలం 7 వైద్య కళాశాలల నిర్మాణాలకు సంబందించి మాత్రమే కాంట్రాక్టను కుదుర్చుకోవడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల కాలవ్యవదిలో కేవలం రూ.1282 కోట్లను మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని, అందులో కూడా రూ.689 కోట్లను బకాయిలు పెట్టడం జరిగిందన్నారు. ఈ సొమ్మును కూడా నాబార్డు నుండి అప్పుగా పొంది ప్రభుత్వం పై వడ్డీబారాన్ని మోపడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం 1990 నాటి ఆర్థిక సరళీ కరణ విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వంపై, ప్రజలపై, విద్యార్థులపై ఎటు వంటి వడ్డీ బారం లేకుండా పిపిపి విధానంలో ఈ వైద్య కళాశాలల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం క్రింద కేవలం 4.50 కోట్లకు మాత్రమే ఆరోగ్య సేవలు అందజేస్తే తమ ప్రభుత్వం ఎన్.టి.ఆర్.వైద్య సేవ పథకం క్రింద దాదాపు 5.10 కోట్లుకు పైబడి ఉచితంగా వైద్య సేవలను అందజేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా వేట నిషేదిత సమయంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.20 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తే తమ ప్రభుత్వం రూ.25 వేలుతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేయడం జరుగుచున్నదన్నారు. నేతన్న నేస్తం క్రింద చేనేత కార్మికులకు గత ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.24 వేలు ఇవ్వడమే కాకుండా చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందజేయడం జరుగుచున్నదన్నారు. గౌడ కులస్తులకు బార్స్, వైన్ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.

Comments

-Advertisement-