రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద

-డాక్టర్ గెలివి సహదేవుడు 

నంద్యాల, సెప్టెంబర్ 11 (పీపుల్స్ మోటివేషన్):-

స్థానిక  రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు విభాగము ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే దిగ్విజయ్ దివస్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. 


ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముందుగా 

ముఖ్య అతిధులు డాక్టర్ గెలివి సహదేవుడు, విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు పుష్పాలు సమర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ 132 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. అన్ని మతాల సారాంశలు ఒకటే అని సహనం, సౌభ్రాతృత్వం, సర్వమత సమానత్వం గురించి సభలో ప్రసంగించారు. మతాల పేరుతో ద్వేషం అసహనం వ్యాప్తి చేయకూడదని అన్నారు. వసుదైక కుటుంబం భావజాలాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. స్వామి వివేకానంద జీవితాన్ని విద్యార్థులు చదవాలని ఎన్నో విషయాలు తెలుస్తాయని తద్వారా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చు అని కుటుంబం గురించి సమాజం గురించి దేశ గురించి ఆలోచించే గొప్ప వారిగా మీరు ఎదగాలని ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. నిజమైన జ్ఞానాన్ని పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మీరు ప్రయత్న పూర్వకంగా పొందడానికి స్వామి వివేకానంద వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మీ మెదడు కండరాలు నరాలు శరీరంలోని ప్రతి భాగాన్ని ఒక ఆదర్శంతో మమేకం చేయండి అప్పుడు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా ముఖ్యం. ప్రతి స్త్రీని దేవతగా చూసిన గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని ప్రపంచానికి చాటిచెప్పారు. ముఖ్యంగా యువతకు పిలుపునిస్తూ లేవండి పోరాడండి మీ అంతిమ లక్ష్యం చేరేవరకు పరిశ్రమించండి నక్షత్రాలు గతి తప్పినా సరే లోకమంతా ఏకమై మిమ్మల్ని ఎదిరించినా సరే పోరాటాన్ని ఆపకండి అని అన్నారు.

కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 11న చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగించిన తర్వాత ప్రపంచం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకుందని. ప్రపంచ ఆధ్యాత్మిక అంశాలకు గురువు స్థానంలో ఉన్న నా భారతదేశానికి నమస్కరిస్తున్నాను అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని అలాగే మన కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అని యూనివర్సల్ బ్రదర్ హుడ్, దిగ్విజయ్ దివస్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఒక దేశం యొక్క ఆశలన్నీ యువతపైనే ఉంటాయి. మీరు సోమరులుగా కాలం గడపకూడదు కార్యదీక్ష పరులు కండి అని స్వామి వివేకానంద అన్నారని చెప్పారు. ముఖ్యంగా యువత జీవితంలో ఎన్ని కష్టాలు అసౌకర్యాలు ఎదురైనా సహనం కోల్పోయి కుటుంబానికి సమాజానికి దేశానికి నష్టం కలిగించే పనులు చేయకూడదని గొప్ప వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందగా ఎదగాలని అన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని అన్నారు. తన గురువు రామకృష్ణ పరమహంస చూపిన మార్గంలో ప్రయాణం చేస్తూ సన్యాసిగా భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని తర్వాత తరాలకు అందించాలని బృహత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని అన్నారు. పవిత్రత సహనం పట్టుదల విజయానికి మూడు సూత్రాలని స్వామి వివేకానంద చెప్పారని విద్యార్థులు అది గ్రహించాలని అన్నారు.

డీన్ ఆఫ్ స్టూడెంట్ అకాడమిక్ ప్రగతి మాట్లాడుతూ కళాశాల విద్యార్థు లు స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. మానవుడిలో సహజ సిద్ధంగానే దాగివున్న శక్తిని వ్యక్తం చేసేదే మతం. ప్రపంచాన్ని దేశాన్ని శక్తివంతం చేయడానికి కావలసినంత పరిజ్ఞానం శక్తి మన ఉపనిషత్తులలో, వేదాలలో ఉన్నాయని వాటిని ఆచరణలో తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. కార్యక్రమంలో ముఖ్య అతిధి డాక్టర్ గెలివి సహదేవుడు గారిని మెమెంటో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్  విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, మురళీధర్, కమల్ ఖాన్,నిర్మల జ్యోతి, హిమబిందు, శేఖర్, మద్దిలేటి ఆండ్రూస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-