ఉల్లిని ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలి
ఉల్లిని ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలి
ఉల్లి పంట తీసుకొని వచ్చే రైతులు ఖచ్చితంగా ఆరబెట్టిన వాటిని మాత్రమే మార్కెట్ యార్డ్ లోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, సెప్టెంబర్ 11 (పీపుల్స్ మోటివేషన్):-
రైతుల నుండి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లు, ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..
గురువారం కర్నూలు మార్కెట్ యార్డు లో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి, రైతులతో మాట్లాడి, అనంతరం అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు తీసుకొని వచ్చిన ఉల్లి పంటను పరిశీలిస్తూ, ఎన్ని రోజులు అరబెట్టారని కలెక్టర్ రైతులను ఆరా తీశారు...డ్యామేజి అయిన ఉల్లిని పరిశీలిస్తూ, ఆరబెట్టకుండా మార్కెట్ యార్డ్ కు తీసుకువస్తే డ్యామేజి అవుతుందని, అలా కాకుండా బాగా ఆరబెట్టిన పంటను మార్కెట్ యార్డ్ లోకి తీసుకొని వస్తే మంచి రేటుకు విక్రయించడానికి అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. మార్కెట్ యార్డ్ లోకి ఉల్లి పంట తీసుకొని వచ్చే ప్రతి రైతు ఉల్లిని బాగా ఆరబెట్టి తీసుకొని రావాలని కలెక్టర్ రైతులను కోరారు...
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ఉల్లి నాణ్యతను పరిశీలించి, ఏ, బి గ్రేడ్లుగా విభజించి, నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఇతర జిల్లాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మార్కెటింగ్ ఏడి నిర్దేశించిన ఇండెంట్ ప్రకారం రైతు బజార్లకు ఉల్లిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్క్ ఫెడ్ డిఎం ను ఆదేశించారు... ఎప్పటికప్పుడు మార్కెట్ యార్డ్ లో ఉన్న ఉల్లిని తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఫీల్డ్ లెవెల్ లో విజిట్ చేసి నార్మ్స్ ప్రకారం ఉల్లి పంట ను 110 రోజులు పండించిన తర్వాత తీసుకొని వస్తున్నారా? లేదా అని వెరిఫై చేసి సర్టిఫై చేసి పంపాలని కలెక్టర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు..ట్రేడర్లు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఎక్కువ ప్రమాణంలో ట్రేడర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు...
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, మార్క్ ఫెడ్ డిఎం రాజు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.